దారుణ హత్య.. ప్రియుడే హంతకుడు, పూడ్చిపెట్టి మరీ..
వివాహేతర సంబంధాలు.. తేడాలు రావడంతో హత్యలు జరుగుతున్నాయి. మెట్రో పాలిటన్ సిటీలలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణ హత్య ఘటన వెలుగుచూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను దారుణంగా హత్యచేశాడు.
రాజమణి స్థానికురాలు.. వయస్సు 48 ఏళ్లు కాగా. గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. ఆందోళనతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కూపీ లాగుతూ ఒకరిని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మిస్టరీ తేల్చారు. అతనే హత్య చేశాడని తేల్చారు. వివాహేతర సంబంధంతోనే ఇలా.. మర్డర్ చేశానని అంగీకరించాడు.

రాజమణి ఓ వివాహిత. కానీ మేడ్చల్ కు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వారి మధ్య గొడవలు జరిగాయి. ఏం జరిగిందో గానీ.. సెప్టెంబర్ 8వ తేదీన రాజమణి కనిపించకుండా పోయింది. ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించిన సమయంలో అసలు విషయం బయటపెట్టాడు. తానే ఆమెను చంపేసినట్టు ఒప్పుకున్నాడు. తాను చేసిన హత్య, దొరక్కుండా తప్పించుకునేందుకు చేసిన నేరాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. గత నేరాలు కూడా చెప్పడంతో పోలీసులే నోరెళ్లబెట్టారు. రాజమణి హత్యతో ఇదివరకు జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
రాజమణిని హత్యచేసి, భూమిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు నిందితుడు. మృతదేహాన్ని గొయ్యి నుంచి బయటకు తీయించారు శామీర్ పేట పోలీసులు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. నివేదికలో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. రాజమణి హత్య విషయం తెలిసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు ఇలాంటి ధైర్యం చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నారు. కానీ రాజమణితో అతనికి వివాహేతర సంబంధం గురించి మాత్రం ప్రస్తావించలేదు. నడి వయస్సురాలు అయిన రాజమణి గురించి చుట్టుపక్కల వారు కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో అతనిపైనే అందరికీ సందేహాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications