హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాప్రాలో 2 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి: చికిత్స పొందుతూ మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కాప్రాలో ఉన్న యాదవ కాలనీలో గురువారం విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే యాదవ కాలనీకి చెందినరంగారెడ్డి, అనూరాధ దంపతుల కుమార్తె సోని.

వీధిలో ఆడాడుకుంటుండగా రెండు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దీంతో కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో చిన్నారి తలకు బలమైన గాయమైంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని గాంధీ ఆసుపత్రికి తరిలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దాంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చీరాని మాటలు, బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేసే తమ కుమార్తె ప్రాణం కుక్కలకు బలికావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Brutally dogs attacked and kill 2 year old girl in kapra, Hyderabad

ఇటీవల కాలంలో నగరంలో ఏ వీధిలో చూసినా కూక్కలు స్వైర్ విహారం చేస్తున్నా, గ్రేటర్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీని ఫలితంగా నగరంలోని ఏదో ఒక వీధిలో చిన్నారులు కుక్కల దాడికి గురవుతున్నారని అన్నారు.

పిచ్చికుక్క దాడిలో ఓ విద్యార్థికి రేబిస్‌ వ్యాధి

పిచ్చికుక్కదాడిలో ఓ విద్యార్ధికి రేబిస్ వ్యాది సోకిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని దొరవారిసత్రం గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్ధికి పిచ్చికుక్క కరిచింది. దీంతో అతనికి రేబిస్ వ్యాధి సోకింది. అయితే... మతిస్థిమితం కోల్పోయిన ఆ విద్యార్ధి ఏడుగురు తోటి విద్యార్ధులపై దాడి చేశాడు.

దీంతో ఆ విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Brutally dogs attacked and kill 2 year old girl in kapra, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X