తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కాగా, శుక్రవారంనాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసససభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారానికి వాయిదా వేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(TS Budget)ను ప్రవేశపెట్టనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి బడ్జెట్ కావడంతో కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలు అమలు లాంటి అంశాలపై ఈ బడ్జెట్‌లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సమావేశాలకు శనివారం ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠగా ఉంది.

శనివారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించనుంది. కాగా, శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా శుక్రవారం ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముందుగా ఎమ్మెల్యే వేముల వీరేశం తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సభలో బలపరిచారు. అనంతరం సభలో సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడారు.
తెలుగుజాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సభలోని సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. విపక్ష నేతల ప్రశ్నలకు, రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో సభా వాడీవేడిగా సాగింది.
నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, జెరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం తాము కాదని బీఆర్ఎస్ కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చే 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇస్తామని, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. హామీలను నెరవేరుస్తామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications