తెలంగాణలో బుల్లెట్ బండి బ్యాన్..? రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తరాలు మారినా క్రేజ్ మారనివి కొన్ని ఉంటాయి. వాటిలో బుల్లెట్ బండి ఒకటి. నాటి నుంచి నేటి వరకూ ఈ బండిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. బుల్లెట్ పై డుగ్.. డుగ్.. అంటూ రూడ్లపై షికార్లు కొట్టాలని యువత కల. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా డుగ్..డుగ్..డుగ్ అని.. అంటే మాత్రం ఈసారి కుదరదు. అవును.. కొంత మంది ఆకతాయిలు బండి ఎక్కువగా శబ్ధం రావాలి.. అందరూ చూడాలని డుగ్.. డుగ్.. మని శబ్ధం వచ్చే పెద్ద పెద్ద సైలెన్సర్‌ను బిగిస్తున్నారు. బండి షోరూం వాడు ఇచ్చే సైలెన్సర్లు కాకుండా అధిక శబ్ధం వచ్చేలా వాటి స్థానంలో ఈ సైలెన్సర్లను బిగిస్తున్నారు. దీంతో వారు రోడ్డు మీద బండిపై వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్ధంతో చిన్నారులు.. వృద్ధులకు ముప్పు పొంచి ఉంది. రహదారులపై వెళ్లే సమయంలో బుల్లెట్ నుంచి వచ్చే అధిక శబ్ధంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు నడిపే ఇతర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం, డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి బుల్లెట్ బండ్లను వాడటం వల్ల నడిపేవాళ్లకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ మేరకు బుల్లెట్ బైకులకు అధిక శబ్ధాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడిన వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 80 కి పైగా కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి అలా సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications