ఎయిర్ పోర్టులో ధర్నా: ఓ క్యాబ్‌ను తగులబెట్టారు
హైదరాబాద్: 'మేరు' క్యాబ్ డ్రైవర్ల ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. సోమవారం రాత్రి కొందరు దుండగులు ఓ క్యాబ్‌ను తగులబెట్టడంతో పాటు మరో రెండు క్యాబ్‌ల అద్దాలను పగులగొట్టారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిర్ పోర్టులో పార్కింగ్ ఫీజు తగ్గించాలని డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనాలు అందించకుండా మేరు క్యాబ్ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో విమానాశ్రయం వందలాది క్యాబ్‌లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications