వచ్చింది ఖమ్మం సభకు.!కూర్చుంది కేసీఆర్ పక్కన.!ప్రస్తావన మాత్రం చంద్రబాబుది.!కేజ్రీ వాట్ ఎ క్రేజీ.!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. ఎవరితోనైనా టచ్ లో ఉండొచ్చు.. ఏ నాయకుడితోనైనా మాట్లాడొచ్చు.. సంప్రదింపులు, క్షేమసమాచారలు ఎక్సేంజ్ చేసుకోవచ్చు.. అది వారి వారి రాజకీయేతర స్నేహానికి నిదర్శనం. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ సమావేశం సందర్బంగా కొన్ని ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం సభకు ఆహ్వానించే అంతర్రాష్ట్ర ప్రముఖుల సంప్రదింపుల సందర్బంగా ఈ పరిణామాలు చోటుకున్నట్టు తెలుస్తోంది.

ఖమ్మం సభకు విశిష్ట అతిధులు..

ఖమ్మం సభకు విశిష్ట అతిధులు..


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరు అని అనేక సందర్బాల్లో నిరూపితమైంది. శాశ్వతంగా దూరమయ్యారనుకున్న తరుణంలో వినూత్నంగా రాజకీయ పొత్తులు పొడుస్తాయి. అధికారాన్ని కూడా సొంతం చేసుకుంటాయి ఆ పార్టీలు. ఇదంతా రాజకీయ నేతల మద్య ఉన్న సఖ్యత, స్నేహం మీద ఆధారపడి, సమకాలీన రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ సభ సందర్బంగా చోటుచేసుకున్న ఆ ఇద్దరు నేతల అంశం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబుకు కర్టెసీ కాల్..

చంద్రబాబుకు కర్టెసీ కాల్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. కమలం, కాంగ్రెస్ పార్టీలలోని అతిరధ మహారథులను తోసిరాజంటూ రెండు సార్లు అధికారం దక్కించుకున్న గొప్ప రాజకీయ నాయకుడు. అంతే కాకుండా పాడి పంటలకు, పంట పొలాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే పంజాబ్ లాంటి రాష్ట్రంలో పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకుని దేశ వ్యాప్తంగా తన పారదర్శక పాలనలోని సత్తాను చాటుకున్నారు అరవింద కేజ్రీ వాల్. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అద్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న నేతల్లో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేజ్రీవాల్ నోట చంద్రబాబు మాట..

కేజ్రీవాల్ నోట చంద్రబాబు మాట..

అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపి నేతలకు ఊహించని షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నారు కేజ్రీవాల్. సమకాలీన రాజకీయాల పట్ల కేజ్రీవాల్ కు ఉన్న దూర దృష్టిని చూసి సహచర నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతటి ప్రాచూర్యం పొందిన అరవింద కేజ్రీవాల్ ను ఖమ్మం సభకు ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ పైన తాను కూడా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లున్నాడో ప్రత్యక్షంగా చూపించాలనుకున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. అందులో భాగంగానే బీజేపి యేతర ముఖ్యమంత్రులను ఖమ్మం సభకు ఆహ్వానించాలనుకున్నారు. ఇక్కడే అసలు కీలక పరిణామం చోటుచేసుకుంది.

కేజ్రీవాల్ ను వారించిన గులాబీ బాస్..

కేజ్రీవాల్ ను వారించిన గులాబీ బాస్..

చంద్రబాబును కలిస్తే మీడియా ఫోకస్ మారుతుంది..
తెలంగాణ ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్బావ సభకు హాజరవ్వాలనుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ మీదుగా ఖమ్మం వెళ్తున్న తరుణంలో టీడిపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కేజ్రీవాల్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చంద్రబాబును తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలవాలన్నది ఆ ప్రస్తావన సారాంశంగా తెలిసింది. కాగా కేజ్రీవాల్ ఖమ్మం సభ కోసం వచ్చి చంద్రబాబును కలిస్తే మీడియా ఫోకస్ వారి కలయిక మీద ఉంటుంది తప్ప ఖమ్మం సభ మీద ఉండదని భావించిన గులాబీ దళపతి, కేజ్రీవాల్ కు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. చివరికి హైదరాబాద్ చేరుకున్నందుకు చంద్రబాబును కేజ్రీవాల్ కర్టెసీగా ఫోన్ లో సంప్రదించివనట్టు విశ్వసనీయ సమాచారం. వార్త తెలిసి ఓహ్ కేజ్రీవాల్.. వాట్ ఎ క్రేజీ యూ ఆర్.. అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+