వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్క రాష్ట్ర సీఎంను గౌరవించలేరు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలా: భగ్గుమన్న బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హైదరాబాద్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన చేతిలోని మైక్ లాక్కొని ఘర్షణ కు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై టిఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

పక్క రాష్ట్ర సీఎంను గౌరవించలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తారా: బండి సంజయ్

పక్క రాష్ట్ర సీఎంను గౌరవించలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తారా: బండి సంజయ్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మను మాట్లాడనీయకుండా మైకు లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పక్క రాష్ట్ర సీఎంను గౌరవించలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. అత్యంత అద్భుతంగా హైదరాబాద్లో జరిగే శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన అతిధిని గౌరవించాలనే కనీసం సోయి కూడా లేకుండా టిఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మెడలో టిఆర్ఎస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజిపైకి ఎలా రానిచ్చారు అని ప్రశ్నించిన బండి సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే భద్రత ఇదేనా అంటూ ప్రశ్నించారు.

గణేష్ శోభాయత్రకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం ఎందుకు రాలేదు

గణేష్ శోభాయత్రకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం ఎందుకు రాలేదు

ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే స్వేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు వెళ్లగలిగే వారా అని ప్రశ్నించారు. బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా అంటూ నిలదీశారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర అత్యంత ఘనంగా జరుగుతుంటే కనీసం సీఎం కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా ఈ కార్యక్రమంలో పాల్గొన లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక అస్సాం నుండి వచ్చిన ముఖ్యఅతిథిని అడ్డుకుంటే పరువు పోతుందన్న కనీస ఆలోచన కూడా లేకపోవడం సిగ్గుచేటు అని బండి సంజయ్ మండిపడ్డారు.

అస్సాం సీఎంపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టాలి

అస్సాం సీఎంపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టాలి


అస్సాం సీఎం పై దాడికి యత్నించిన టీఆర్ఎస్ నేత పై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల పండుగలలో అడ్డంకులు సృష్టించడం కోసం కెసిఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని, శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొని, కెసిఆర్ చెంప చెళ్ళుమనిపించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయనపై దాడి చెయ్యటం కోసం కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

English summary
Bandi Sanjay lashed out at CM KCR saying that KCR cannot respect the CM of other states, Is national politics necessary to him?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X