అదుపుతప్పిన కారు.. హుస్సేన్ సాగర్ లోకి జంప్.. అతివేగమే కారణమా?
హైదరాబాద్ : లుంబినీ పార్క్ దగ్గర అదుపుతప్పిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. గ్రిల్స్ ను రాసుకుంటూ వెళ్లి సాగర్ లో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురు అంబర్ పేటకు చెందిన పవన్, మణికంఠ, వత్సల్, రమణీయగా పోలీసులు గుర్తించారు. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు అదుపు తప్పిందా లేదంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications