విషాదం: నిద్రిస్తున్న చిన్నారిపైనుంచి వెళ్లిన కారు, పసిపాప మృతి
హైదరాబాద్: ఉపాధి కోసం ఓ కుటుంబం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ ఆ కుటుంబం జీవిస్తోంది. ఈ క్రమంలో కూలీ పనుల్లో నిమగ్నమైన తల్లి.. తన కూతురు నిద్రపోవడంతో ఓ భవనం పార్కింగ్ ప్లేస్‌లో ఖాళీగా ఉన్న స్థలంలో పడుకోబెట్టింది. అయితే, కాసేపటికే ఓ కారు ఆ చిన్నారిపైనుంచి వెళ్లింది. దీంతో ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటన హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవిత, రాజు అనే దంపతులు గత మూడు సంవత్సరాలుగా నగరంలో కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమకు ఏడేళ్ల వయస్సున్న కుమారుడు, మూడేళ్ల పాప లక్ష్మి ఉన్నారు. లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్లాబు పనులు చేస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం తమతోపాటే వచ్చిన చిన్నారి లక్ష్మి(3)ని తల్లి కవిత నిద్రిపుచ్చింది. నీడ ఉండటంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ స్థలంలో చిన్నారిని పడుకోబెట్టింది. ఆ తర్వాత నిర్మాణ పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకుని ఉండటాన్ని గమనించకుండా కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాప తలపైకి కారు ముందు చక్రం ఎక్కడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణాన్ని చూసిన ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది.
— oneindiatelugu (@oneindiatelugu) May 25, 2023
ఇంటి నిర్మాణం కోసం కూలికి వచ్చిన వాళ్ల పాపను పిల్లర్ పక్కన పడుకోబెట్టింది కారు లోపలికి వచ్చి ఆ పాప మీదకి ఎక్కించారు..!! pic.twitter.com/EW7YTCrqu7
బతుకుదెరువు కోసం వస్తే తన చిట్టితల్లి ప్రాణాలు పోయాయని గుండెలవిసేలా రోదించింది ఆ పాప తల్లి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలో నమోదైన ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆ పాప తల్లిదండ్రులు కోరుతున్నారు.
కాగా, హరిరామకృష్ణ భార్య స్వప్న ఎస్ఐ అని తెలిసింది. పాప మరణానికి కారణమైన హరిరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications