కెసిఆర్, హరీష్‌లపై వ్యాఖ్యలు: రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలపై కేసు
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల పైన కేసు నమోదు చేసినట్లు మెదక్ జిల్లా చిన్నకోడూరు పోలీసు స్టేష్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కనక రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలతో పాటు పలువురు జిల్లా నాయకుల పైన కేసు నమోదు చేశామన్నారు.

ప్రాణహిత - చేవెళ్ల నిర్మాణంతో భూములు కోల్పోతున్న పెద్దకోడురు రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు శుక్రారం నాడు వచ్చిన రేవంత్, ప్రతాప్ రెడ్డిలు ఇష్టారీతిన మాట్లాడారని ఫిర్యాదు చేశారు. వారి పైన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు ఫిర్యాదు చేశారని ఎస్సై చెప్పారు.












Click it and Unblock the Notifications