వారిపై కేసులు పెట్టేంత వరకు వేశ్యలపై కేసులు పెట్టొద్దు: నారాయణ
హైదరాబాద్: రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే వేశ్యలపై కేసులు పెట్టకూడదని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యేలను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకర్ష్ కింద ఆహ్వానించినప్పుడు కేసీఆర్ గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ఆయన అన్నారు.
ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని నారాయణ డిమాండు చేశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ హామీ ఇచ్చిన వారి చొక్కాలు విప్పి ఊరేగిస్తే తాము అండగా ఉంటామని నారాయణ అన్నారు.

అమెరికాలో తెలుగు విద్యార్థులను అవమానించడం బాధాకరమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అమెరికాకు వెళ్లేందుకు తిరిగి అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
అమెరికా చేసిన అవమానానికి విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారని నారాయణ అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దానికి అమెరికా ఎంబసీయే బాధ్యత వహించాలని నారాయణ కోరారు.












Click it and Unblock the Notifications