టీడీపీతో మైత్రికి నో ఇబ్బంది: బీజేపీ వేచిచూసే ధోరణి
ఢిల్లీ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారం, ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేప్ అంశాల పైన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. తెలంగాణలో వెలుగు చూసిన ఓటుకు నోటు స్కాం వాస్తవాలు వెల్లడైనప్పుడు స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ఆరోపణల పైన తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టేపులు వాస్తవం కాదని టీడీపీ చెబుతోందన్నారు. వాస్తవాలు వెల్లడయ్యాక అప్పుడు చూద్దామని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ.. ఈ విషయంలో ఇప్పుడే తామేమీ జోక్యం చేసుకోమని చెప్పారు.
ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పుడు బీజేపీ - టీడీపీ మైత్రికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ ఈ అంశం గవర్నర్ చూసుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications