ఓటుకు నోటు కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో, వీడియో సీడీలు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఆడియో, వీడియో సీడీలను, ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గొంతును ధ్రువీకరించడానికి వాటిని ఎసిబి అధికారులు ల్యాబ్‌కు పంపించారు.
మొబైల్ ఫోన్లను కూడా ఎసిబి అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలకు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు చెందిన వీడియో, ఆడియో సంభాషణల టేపులను, మొబైల్ ఫోన్లను పంపించారు.

ఇప్పటికే ఆడియో, వీడియో టేపుల్లో రికార్డయిన గొంతులను ఎసిబి అధికారులు నిర్ధారించుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రెండు మూడు రోజుల్లో నివేదిక రావచ్చునని భావిస్తున్నారు. నివేదిక అధారంగా ఎసిబి తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఎన్నికల హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నాయకురాలు షర్మిల పరామర్శ యాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఏ-1 నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications