సండ్ర బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా, ఎవరీ జనార్ధన్: ఏసీబీ డైలమా!

హైదరాబాద్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ పైన విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

బెయిల్ పైన కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు గురువారం నాడు సమయం కోరారు. దీంతో పిటిషన్ పైన విచారణను వాయిదా వేశారు. మరోవైపు, ఏసీబీ సండ్రను గురువారం నాడు కస్టడీకి తీసుకుంది. ఆయనను రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది.

Cash for Vote Case: Hearing on Sandra Bail Petition adjourned till Monday

జనార్దన్ పైన ఏసీబీ డైలమా!

ఓటుకు నోటు కేసులో ఇటీవల కొత్తగా జనార్ధన్ పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఆ జనార్ధన్ ఎవరనే విషయం తెలుసుకునేందుకు ఎసిబి ప్రయత్నిస్తోంది. బాస్‌కు మధ్యవర్తిగా జనార్ధన్ వ్యవహరించాడని ఏసీబీ అనుమానిస్తోంది.

కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, సండ్ర మధ్య జరిగిన సంభాషణల్లో పలుమార్లు జనార్ధన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఈ జనార్ధన్ ఎవరన్న విషయమై ఏసీబీ ఇంకా తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. కేసులో జనార్ధన్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తోంది.

జనార్దన్ పేరు నేపథ్యంలో ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న విషయంలో తలపట్టుకుంటున్నారని తెలుస్తోంది. సండ్రను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సండ్రను విచారిస్తే జనార్ధన్ ఎవరో తెలియవచ్చునని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+