'ఆపరేషన్ రేవంత్': ఆ ఏసీబీ అధికారి కీలకపాత్ర, టీఆర్ఎస్ సర్కారు బంఫర్ ఆఫర్..!

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడంలో తెలంగాణ నిఘా విభాగానికి చెందిన ఒకరు కీలకంగా వ్వవహారించినట్టు ఏపీ ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే వరకు జరిగిన ఆపరేషన్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ నిర్ధారణకు వచ్చింది.

తెలంగాణకు చెందిన ఈ అధికారి ఆధ్వర్యంలోనే పది మందితో కూడిన ప్రత్యేక బృందం 'ఆపరేషన్ రేవంత్'ను నిర్వహించినట్లు సమాచారం. అంతేకాదు ఏపీ సీఎంతో సహా, మంత్రులు, ఎంపీలు, ఉన్నాతాధికారులు మొత్తం 120 మందిపై నిఘా పెట్టి వారి ఫోన్లను ట్యాపింగ్‌లో పెట్టినట్టు ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు.

Cash for vote scam: ACB officer key role behind mla revanth reddy arrest

చంద్రబాబు ప్రభుత్వంలోని ఉన్నాతాధికారుల ఫోన్ల ట్యాపింగ్, వారిపై నిఘాకు సంబంధించిన ముఖ్య సమాచారం ఇప్పుడు ఏపీ ఇంటిజిజెన్స్ అధికారులు సంపాదించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పూర్తి ఆధారాలను కేంద్ర హోంశాఖకు అందజేయడంతో పాటు, సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, రక్షణ లాంటి అధికారులను గవర్నర్‌కు ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీ కోరనున్నారని తెలుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడంలో కీలకంగా వ్యవహారించిన నిఘా అధికారికి తెలంగాణ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పునర్విభజనలో ఈ తెలంగాణ కేడర్‌కు ఈ అధికారిని కేటాయించింది.

తెలంగాణ సర్కారులో నిఘా విభాగంలో పని చేస్తోన్న ఈ అధికారికి నోటుకు ఓటు ఆపరేషన్‌ను విజయవంతం చేసినందుకు గాను సైబరాబాద్ కమిషనర్‌గా నియమించినున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+