కూతురుకు లండన్ విద్యాసంస్థలో సీటు: జగన్ లండన్ టూర్‌కు ఓకే, వరుస షాక్‌ల తర్వాత రిలీఫ్
యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
చదవండి: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు: జగన్ గర్వించేలా చేసిన కూతురు

కూతురుకు సీటు
ఈ నెల 11వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్నారు. జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు వచ్చింది.

ఇటీవల న్యూజిలాండ్, ఇప్పుడు లండన్
ఆమెను వర్సిటీలో చేర్పించేందుకు జగన్ లండన్ వెళ్తున్నారు. ఇందుకోసం ఆయన కోర్టు అనుమతి కోరారు. దానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు జగన్ లండన్ పర్యటనలో ఉండనున్నారు. ఇటీవలే జగన్ కోర్టు అనుమతితో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి వచ్చారు.

వరుస షాక్‌ల అనంతరం..
వైసిపి అధినేత జగన్‌కు లండన్ పర్యటన ఓ రిలీఫ్‌గా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవి చూసింది. మరోవైపు, వైసిపి ఓటముల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వైసిపి, జగన్ పార్టీలో ఒత్తిడి.. రిలీఫ్
ప్రస్తుతం వైసిపి వైపు ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన ఆయనకు కొంత రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు. మొత్తానికి వరుస షాకుల అనంతరం జగన్‌కు ఓ పెద్ద రిలీఫ్ అంటున్నారు.


Click it and Unblock the Notifications