తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ - కౌంట్ డౌన్...!!

తెలంగాణ అసెంబ్లీ(Assembly Elections) ఎన్నికల కసరత్తు వేగం పెరిగింది. ఇటు పార్టీలు అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం షెడ్యూల్..ఎన్నికల ఏర్పాట్లు పైన కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే తెలంగాణ(Telangana)లో ఎన్నికల దిశగా తాత్కాలిక షెడ్యూల్ ను సిద్దం చేసుకుంది. ఈ మేరకు కార్యక్రమాలకు గడువు నిర్దేశించుకున్నారు. కొన్నిరోజులు అటుఇటుగా ఇదే షెడ్యూల్‌(Election Schedule)తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ఎన్నికల కసరత్తు:ఎన్నికల కసరత్తులో భాగంగా అధికారులు ఒక షెడ్యూల్ సిద్దం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కార్యాచరణ వేగవంతం చేసారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(CEO) కార్యాలయం 2018లో జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ నే ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం తమ కార్యక్రమాల క్యాలెండర్ సిద్దం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణతోసహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్‌ తొలివారం లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ (Rajiv Kumar)నేతృత్వంలో కేంద్ర ఎన్నికలసంఘం ఫుల్‌ బెంచ్‌ అక్టోబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది.

CEC begins Exercise on TS Elections, Polling likely to be hled in December First Week

షెడ్యూల్ దిశగా:సీఈసీ అధికారుల పర్యటన తరువాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్‌(Election Schedule) ప్రకటిస్తారు. నిర్దిష్ట తేదీలతో వచ్చే అక్టోబర్‌ టు డిసెంబర్‌ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యాక్రమాలతో ఎన్నికల సంఘం ఓ కేలండర్‌ రూపొందించింది. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ప్రథమస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి సమీకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఎంపిక, స్ట్రాంగ్‌ రూమ్స్, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన .. నిర్థారణ, దర్యాప్తు సంస్థల నోడల్‌ అధికారులు..

సహాయ వ్యయ పరిశీలకులు.. వ్యయ పర్యవేక్షణ బృందాలు..రిటర్నింగ్‌ అధికారులు..సెక్టార్‌ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల పరిశీలన టీమ్‌ల(Elecrtion Observors) ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్‌నెలలోగా పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం నిర్దేశించుకుంది.

CEC begins Exercise on TS Elections, Polling likely to be hled in December First Week

కౌంట్ డౌన్ షురూ:నవంబర్‌లో వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. పోలింగ్‌ కేంద్రాల(Polling Stations) ప్రకటనతో పాటుగా వికలాంగులు..80 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులైన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడానికి ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు. సీ-విజిల్‌ ద్వారా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ.. ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌..కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం..

బ్యాలెట్‌ పత్రాల ముద్రణ..పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ(Postal Ballot..స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలని షెడ్యూల్ గా నిర్ణయించుకున్నారు. కేంద్రంలో జమిలి ఎన్నికల పైన కొంత కాలంగా ప్రచారం సాగినా..ఇప్పుడు అటువంటి ప్రతిపాదన ఇప్పట్లో అమలు కాదని తేలటంతో ఇక ఎన్నికల షెడ్యూల్ మరో 10-15 రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+