వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహబూబాబాద్ జిల్లాను వణికిస్తున్న సెల్యులైటిస్.. ఆస్పత్రులలో పెరుగుతున్న బాధితులు, ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అంతుచిక్కని రోగాలు కూడా ప్రబలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ప్రజలు సెల్యులైటిస్ బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. సెల్యులైటిస్ వ్యాధితో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో ఆసుపత్రులలో చేరుతున్నారు.

మహబూబాబాద్ లో ప్రబలుతున్న సెల్యులైటిస్

మహబూబాబాద్ లో ప్రబలుతున్న సెల్యులైటిస్

4 సంవత్సరాల క్రితం కూడా మహబూబాబాద్ వాసులు సెల్యులైటిస్ అనే కణజాల క్షీణత వ్యాధితో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జిల్లా వైద్య అధికారులు అక్కడ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి, అక్కడి ప్రజలు తాగుతున్న మంచినీటిని టెస్ట్ కు పంపించారు. ప్రత్యేక శిబిరాల ఏర్పాటుతో వారికి చికిత్స నిర్వహించారు. దీంతో అప్పుడు ఆ వ్యాధి తగ్గుముఖం పట్టింది. కానీ ప్రస్తుతం మళ్లీ ఆ వ్యాధి ప్రబలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మహబూబాబాద్ జిల్లాలో ఈ మండలాలోనే సెల్యులైటిస్ బాధితులు

మహబూబాబాద్ జిల్లాలో ఈ మండలాలోనే సెల్యులైటిస్ బాధితులు

మహబూబాబాద్ జిల్లా లోని కేసముద్రం, తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ మండలాలలో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కల్వల గ్రామంలో ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే 27 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి కాళ్లు ఎరుపెక్కి, బొబ్బలు రావడంతో ప్రారంభమై, కాళ్లలో కణజాలం క్షీణించి, అది నిర్లక్ష్యం చేస్తే విస్తరించి, ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో సెల్యులైటిస్ విస్తరణ ఎక్కువగా ఉంటుందని జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు.

షుగర్, బోదకాలు వ్యాధిగ్రస్తులు సెల్యులైటిస్ బారిన పడే ప్రమాదం

షుగర్, బోదకాలు వ్యాధిగ్రస్తులు సెల్యులైటిస్ బారిన పడే ప్రమాదం


ఇక షుగర్, బోదకాలు వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. వర్షాకాలంలో పొలం పనులకు వెళ్ళేవారు, వారి కాళ్లకు ఏదైనా గుచ్చుకుంటే, అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఇన్ఫెక్షన్ పెరిగి సెల్యులైటిస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ జరిగిన ప్రదేశంలో ఉన్న చర్మాన్ని తొలగించి, చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు అని చెబుతున్నారు. ఏదైనా చిన్న అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

సెల్యులైటిస్ పై వైద్యులు చెప్తుంది ఇదే

సెల్యులైటిస్ పై వైద్యులు చెప్తుంది ఇదే


సెల్యులైటిస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో, స్థానికంగా అందరూ ఇది అంటు వ్యాధి అని భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తున్న వైద్యులు సెల్యులైటిస్ అనేది అంటువ్యాధి కాదని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే, దోమలను అరికట్టక పోతే, ఏదైనా గుచ్చుకుని అయిన గాయానికి చికిత్స చేయించుకోకపోతే సెల్యులైటిస్ బారినపడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాళ్లకు ఏమి గుచ్చుకోకుండా జాగ్రత్తలు పడాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా గుచ్చుకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక సెల్యులైటిస్ బారినపడి పరిస్థితి సీరియస్ గా ఉన్న పేషెంట్లను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి వైద్యులు.

English summary
Cellulitis plagues Mahbubabad district. Locally there is concern over cellulitis with increasing number of victims in hospitals. Doctors say that it is a seasonal disease that occurs during the rainy season and suggest to be careful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X