• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలపై దెబ్బకొడుతున్న కేంద్రం; ఐటీ, ఈడీ దాడులతో కేసీఆర్ సన్నిహితులకు భయం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ తో కేంద్రంలోని బిజెపి ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసిందా? బిజెపి ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తుందా? సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ప్రముఖుల పైన నజర్ పెట్టిందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఐటి దాడులు, ఈడి సోదాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ సతమతం

ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ సతమతం

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఐటీ, ఈడీ దాడులతో సతమతమవుతోంది. టిఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులకు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సెగ తగులుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చీకటి ప్రవీణ్ కేసును కేసుతో తెలంగాణ మంత్రుల పై దాడులు కొనసాగుతున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అంతకుముందు గ్రానైట్ వ్యవహారంలో గంగుల కమలాకర్, గాయత్రి రవిచంద్ర తదితరుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు కొనసాగాయి.

 ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలువురు వ్యాపారవేత్తల విచారణ.. ఒత్తిడి

ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలువురు వ్యాపారవేత్తల విచారణ.. ఒత్తిడి

ఇక ఇవే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలపై ఈడీ దాడులు కొనసాగాయి. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి తోపాటు పలువురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన విషయం కూడా తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక రావు, రామచంద్ర పిళ్ళై లను ఈడి విచారించింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కుమార్తె కవిత పేరు కూడా ప్రధానంగా వినిపించడంతో టిఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి గురవుతోంది.

 కేసీఆర్ కు ఆర్ధికంగా సహకరించే వారిపై దర్యాప్తు సంస్థల నజర్

కేసీఆర్ కు ఆర్ధికంగా సహకరించే వారిపై దర్యాప్తు సంస్థల నజర్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉండి, సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న వారిపైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రచారం జరుగుతుండటంతో టిఆర్ఎస్ కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ప్రారంభం మాత్రమేనని ఆర్థిక మూలస్తంభాలుగా టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

కేసీఆర్ దాడులను ఎదుర్కోవాలని చెప్పినా, అభద్రతా భావంలో నేతలు

కేసీఆర్ దాడులను ఎదుర్కోవాలని చెప్పినా, అభద్రతా భావంలో నేతలు


కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ చెబుతున్నప్పటికీ, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో నేతలకు బోధపడటం లేదు. ఎవరికివారు అభద్రతా భావానికి గురవుతూ అధికారంలో ఉన్నప్పటికీ కష్టంగా ముందుకు సాగుతున్నారు. మరికొందరైతే సీఎం కేసీఆర్ అనవసరంగా కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నారని, ఇప్పుడు తాము తలనొప్పి ఫేస్ చేయాల్సి వస్తుందని లోలోపల మదన పడి పోతున్నారు.

 బీఎల్ సంతోష్ కు నోటీసుల ఎఫెక్ట్? టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలపై గట్టి దెబ్బ

బీఎల్ సంతోష్ కు నోటీసుల ఎఫెక్ట్? టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలపై గట్టి దెబ్బ


తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి జాతీయ నేతలను టార్గెట్ చేయడం కూడా కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమని భావిస్తున్న పరిస్థితి లేకపోలేదు. బిజెపి రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న బిఎల్ సంతోష్ కు నోటీసు ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆయనను అరెస్టు చేస్తామని సంకేతాలివ్వడం బీజేపీ పెద్దలకు ఏమాత్రం రుచించడం లేదు. ఈ క్రమంలోనే బిజెపి టిఆర్ఎస్ పార్టీ ఆర్ధిక మూలాల పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ ఆర్థిక మూలాలను గట్టిగా దెబ్బ తీస్తే, అప్పుడు కెసిఆర్ దారికి వస్తారని బిజెపి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై, తాజాగా చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

English summary
The center will hit the financial sources of TRS. With IT and ED attacks, KCR's close friends, financially strong businessmen and politicians in Telangana were scared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X