ఖమ్మంకు శుభవార్త వినిపించిన నరేంద్రమోడీ

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తియ్యటి శుభవార్తను వినిపించారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని, ఖమ్మంను కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటికే ఖమ్మం అభివృద్ధికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. జిల్లాను సుందరంగా తీర్చిదిద్దేందుకు జాతీయ రహదారులను నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ఖమ్మంతో అనుసంధానం
ఖమ్మం పట్టణంలోని రోడ్లను ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించి వాటితో అనుసంధానం చేయబోతున్నట్లు తుమ్మల తెలిపారు. దీనికి సంబంధించి రూ.654 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని జిల్లా అభివృద్ధికి కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ నుంచి ఖమ్మం వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలనే యోచనలో కేంద్రం ఉంది. అంతేకాకుండా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని త్వరలోనే ఆరులైన్లకు విస్తరించనున్నారు.

central government good news for Khammam Outer ring road works will start soon

మొత్తం 181 కిలోమీటర్లను
తెలంగాణలోని దండుమల్కాపూర్‌ నుంచి ఏపీలోని నందిగామ వరకు ఉన్న 181.5 కిలోమీటర్ల దూరాన్ని ఆరు లైన్లుగా అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడంతో టోల్ వసూళ్లు తగ్గిపోయేయనే కారణంతో జీఎమ్మార్ సంస్థ రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు. వాస్తవానికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని 2024 వరకు దశలవారీగా ఆరులైన్లకు విస్తరించాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంది. టోల్ వసూళ్ల గడువు పెంచాలని కోర్టును ఆశ్రయించడంతో విస్తరణ పనులు ఆగిపోయాయి. దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+