Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రంలోని ఓ నాయకుడి మరణం; గాంధీభవన్ లో జరిగిన పంచాంగ శ్రవణంలో సంచలన విషయాలు

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. శుభకృత్ నామ ఉగాది సంవత్సరం అందరికీ శుభాలను చేకూరుస్తుందని భావిస్తూ ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడు సంవత్సరాలుగా ఉగాది పండుగకు దూరంగా ఉన్న తెలుగు ప్రజలు ఈసారి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ పండుగను జరుపుకుంటున్నారు. పంచాంగ శ్రవణాలు, కవిసమ్మేళనాలతో ఉగాది పర్వదినం తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతోంది.

 గాంధీ భవన్ లో జరిగిన పంచాంగ పఠనంలో సంచలన విషయాలు

గాంధీ భవన్ లో జరిగిన పంచాంగ పఠనంలో సంచలన విషయాలు


ఇక గాంధీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లతోపాటు పలువురు ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. పంచాంగ పఠనం లో వేద పండితులు శ్రీనివాసమూర్తి పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ సంవత్సరం కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తాయన్న వేద పండితులు

ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తాయన్న వేద పండితులు


ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలన తో ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తాయని శ్రీనివాస మూర్తి వెల్లడించారు. ఇక కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తన విశ్వరూపం చూపిస్తారని శ్రీనివాస మూర్తి తెలిపారు. పంచాంగ శ్రవణం తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రజా సమస్యల కోసం ప్రజల తరఫున సమరోత్సాహంతో పని చేస్తామని వెల్లడించారు.

 ఉగాది ప్రజల కష్టాలను దూరం చెయ్యాలన్న రేవంత్ రెడ్డి

ఉగాది ప్రజల కష్టాలను దూరం చెయ్యాలన్న రేవంత్ రెడ్డి


ఈ ఉగాది ప్రజల కష్టాలను దూరం చేయాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏ లక్ష్యసాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు . తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 42 లక్షల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 80 లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు వస్తాయని తెలిపిన రేవంత్ రెడ్డి

 తెలంగాణాలో మహిళలకు గౌరవం లేదన్న రేవంత్ రెడ్డి

తెలంగాణాలో మహిళలకు గౌరవం లేదన్న రేవంత్ రెడ్డి


తెలంగాణ ముగ్గురు మహిళల సారధ్యంలో ఏర్పడిందని ఇప్పుడు తెలంగాణా లో మహిళలకు రక్షణ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం తేవాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి, పార్లమెంట్లో సోనియమ్మ, మీరాకుమార్, సుష్మాస్వరాజ్ తో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని రేవంత్ విమర్శించారు. ఈ ఉగాది ప్రజల జీవితాలలో నూతన ఉత్సాహాన్ని నింపాలని, ప్రజలు కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+