హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ సమైక్యత - తెలంగాణ విమోచన దినోత్సవాల వేడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాళ నిర్వహించ తలపెట్టిన రెండు కార్యక్రమాలు పోటాపోటీగా సాగనున్నాయి. ఎత్తుకు పైఎత్తు వేస్తోన్నాయి. ఆధిపత్య పోరును మొదలు పెట్టాయి. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని చాటుకోవడానికి ఇవ్వాళ్టి కార్యక్రమాలు వేదికగా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మినిట్ టు మినిట్ మీ కోసం..

Centre and Telangana government hold National Integration Day and Liberation Day celebrations today

Newest First Oldest First
3:24 PM, 17 Sep
తెలంగాణ

తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దివ్యజ్ఞాన్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
12:31 PM, 17 Sep
తెలంగాణ

హైదరాబాద్‌లో హోంమంత్రి అమిత్‌ షా అశ్వికదళం ముందు తన కారును పార్క్ చేసిన టీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్. దాన్ని బలవంతంగా పక్కకు తొలగించిన భద్రత సిబ్బంది.
11:46 AM, 17 Sep
తెలంగాణ

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన కేసీఆర్.
11:32 AM, 17 Sep
తెలంగాణ

జాతీయ సమైక్యత దినోత్సవాలను పురస్కరించుకుని తన కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.
11:05 AM, 17 Sep
తెలంగాణ

గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
11:00 AM, 17 Sep
తెలంగాణ

75 ఏళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చెప్పారు. ఆ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు దక్కుతుందని వ్యాఖ్యానించారు.
10:59 AM, 17 Sep
తెలంగాణ

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకం ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
10:57 AM, 17 Sep
తెలంగాణ

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ.. కర్ణాటకను మించి పోయిందని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఐటీలో ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే అధిక వృద్ధిరేటును అందుకున్నామని స్పష్టీకరణ.
10:56 AM, 17 Sep
తెలంగాణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయం కారణంగానే రాజకార్ల పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని పేర్కొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
10:48 AM, 17 Sep
తెలంగాణ

జాతీయ సమైక్యత దినోత్సవాలను పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు.
10:32 AM, 17 Sep
తెలంగాణ

ఓటుబ్యాంక్ రాజకీయాల కోసమే కొన్ని పార్టీలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకున్నాయని, తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకోలేదని పేర్కొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
10:21 AM, 17 Sep
తెలంగాణ

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అధికార టీఆర్ఎస్
10:19 AM, 17 Sep
తెలంగాణ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచనం దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తోన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా 13 నెలల పాటు తెలంగాణ ప్రజలు రజాకార్ల పాలనలో ఉన్నారని పేర్కొన్నారు.
10:11 AM, 17 Sep
తెలంగాణ

టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు.
9:56 AM, 17 Sep
తెలంగాణ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచనం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి.
9:23 AM, 17 Sep

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచనం దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు.
9:19 AM, 17 Sep
తెలంగాణ

విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
9:05 AM, 17 Sep
తెలంగాణ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచనం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అమర జవాన్ల స్థూపానికి ఆయన నివాళి అర్పించారు.
8:44 AM, 17 Sep
తెలంగాణ

సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. గోవా లిబరేషన్‌ డేకు కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ విమోచన దినోత్సవానికి ఒక్కరూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
8:28 AM, 17 Sep
తెలంగాణ

చాకలి ఐలమ్మ , దొడ్డి కొమరయ్య , షోయబుల్లా ఖాన్ల త్యాగం వృధా కానివ్వబోమంటూ బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు.
7:45 AM, 17 Sep
తెలంగాణ

విమోచన వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే వేడుకలకు హాజరవుతారు.
7:42 AM, 17 Sep
తెలంగాణ

సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకుని టీఆర్ఎస్, బీజేపీ తెలంగాణలో పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. టీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవాలకు సన్నద్ధమైంది. బీజేపీ తెలంగాణ విమోచన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

English summary
Centre and Telangana govt hold National Integration Day and Liberation Day celebrations today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X