Loksabha Electiion 2023: రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న వికాస్ రాజ్..!
తెలంగాణలో జరుగుతూన్న లోక్ సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ అంచనా వేశారు. ఆయన ఎస్ఆర్ నగర్ లోని ఆదర్శ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఉన్నవారు బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు.
పోలింగ్ స్టేషన్లలో భారీ సంఖ్యలో క్యూలైన్లు ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు భారీగా తరలొచ్చు ఓటు వేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కాస్త లేట్ అయినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారని చెప్పారు. అనంతరం మెయిన్ పోలింగ్ ప్రారంభమైందిని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని చెప్పారు.

ఎక్కడైనా సమస్య ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలన్నారు. మాదాపూర్ లోని వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్ కాలేజ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 431 లో హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కుటుంబ సభ్యుల తో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మొఘల్ పుర హరిబౌలి రైఫాయం స్కూల్ 5 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications