బాబు కేసీఆర్ మధ్య రాజీ..!: చాడా, ఆ సీఎం ఆత్మ కెసిఆర్‌లో: నాగం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు.

దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదిరనట్లు ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ వైఖరిపై మండిపడ్డ నాగం జనార్దన్ రెడ్డి

chada venkat reddy fires on kcr and Chandrababu naidu

తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ పేద రాష్ట్రంగా ఎలా మారిందో వివరించాలని అన్నారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని ఆంధ్రా వాళ్ల చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవని అన్నారు.

గతంలో ఓ సీఎంని ఆవహించిన ఆత్మే ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆవహించిందన్నారు. ఆ ఆత్మ మీద ఆధారపడే కెసిఆర్ సర్కారు నడుస్తోందన్నారు. కెసిఆర్ తన అనుచర వరగానికే పెద్ద పెద్ద కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+