హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నమస్తే' చెప్పి దొరికిపోయాడు: ఆరోజు ఏం జరిగింది?, స్నాచర్ నర్సింహకు చెక్ వెనుక?

థాయ్ లాండ్ వెళ్లి మసాజ్ చేయించుకోవాలనేది నర్సింహ కోరిక. అందుకయ్యే ఖర్చుల కోసం మరోసారి స్నాచింగ్ చేయాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు. దసరా తర్వాత మరోసారి స్నాచింగ్ చేయాలని కూడా ముందే నిర్ణయించుకున్నట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జల్సా చేయడమే బతుకనుకున్నాడు.. ఒళ్లు వంచి పనిచేయడం కన్నా తేరగా కొట్టేడయడమే డబ్బు సంపాదనకు మార్గం అనుకున్నాడు. 12ఏళ్లుగా 'చైన్ స్నాచింగ్' చేస్తూ బాగానే వెనకేశాడు.

ఇన్నేళ్ల నుంచి పోలీసులు అతన్ని పట్టుకోవడంలో విఫలమవడంతో.. ఇక ఎవరికీ దొరకననుకున్నాడు. కానీ ఎట్టకేలకు తన అక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది. ఓ కవల జంట ఇచ్చిన సమాచారమే అతన్ని పట్టించింది. దీంతో కేబీఆర్ పార్కులో వరుస స్నాచింగ్ ఘటనలకు తెరపడినట్లయింది.

జల్సా కలలు:

జల్సా కలలు:

నర్సింహ అలియాస్ రిషి చదవింది పదో తరగతి. ఎప్పుడూ లగ్జరీ లైఫ్ గడపాలనే కలలు కనేవాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. బయట మాత్రం సుజాత హైస్కూల్లో చదివినట్లు చెప్పుకునేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ పట్టుకుని బీటెక్ స్టూడెంట్ గా పరిచయం చేసుకునేవాడు. పబ్బులు, విదేశీ టూర్స్, గర్ల్ ఫ్రెండ్ తో షికారుకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. ఆ ఆలోచనలే నర్సింహ నుంచి రిషిగా అవతారం ఎత్తేలా చేశాయి.

కేబీఆర్ పార్కు ప్రతీ అంగుళం తెలుసు:

కేబీఆర్ పార్కు ప్రతీ అంగుళం తెలుసు:

పోలీసుల వద్ద ఉన్న బ్లూ ప్రింట్ కన్నా నర్సింహకు కేబీఆర్ పార్కులో ప్రతీ అంగుళం గురించి క్షుణ్ణంగా తెలుసు. పార్కుకు వెళ్లే తోవలు, ఎస్కేప్ అయ్యే దారుల గురించి బాగా తెలిసినవాడు. స్నాచింగ్ చేయడానికి, తప్పించుకోవడానికి అనువుగా ఉండటం వల్లే అతను కేబీఆర్ పార్కును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వాకింగ్ చేసినట్లు నటించి రెక్కీ నిర్వహించడం.. ఆపై స్నాచింగ్ చేయడం ఇతని అలవాటు.

నమస్తే పట్టించింది:

నమస్తే పట్టించింది:

పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి వచ్చే రెగ్యులర్ వాకర్లను గుర్తుంచుకునేవాడు. ఈ క్రమంలోనే పార్కుకు రెగ్యులర్ గా వచ్చే ఓ కవల స్టంట్ మాస్టర్లకు తరుచూ నమస్తే పెట్టేవాడు.

ఈ నేపథ్యంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్‌ లాక్కుని అక్కడినుంచి ఎస్కేప్ అయ్యాడు. అయితే ఆ సమయంలో కవల స్టంట్ మాస్టర్స్ అతనికి ఎదురుపడటంతో.. వారికి నమస్తే చెప్పాడు. ఇంతలోనే పార్కులో చోరీ జరిగిందని ఆ స్టంట్ మాస్టర్స్ కు తెలిసింది. ఆ సమయంలో అటువైపు నర్సింహ ఒక్కడే వెళ్లడం వారికి అనుమానం కలిగించేలా చేసింది.

విషయం పోలీసులకు చెప్పడంతో.. నాలుగు రోజుల క్రితం అదే పార్కుకు వచ్చిన నర్సింహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. , తాను బీటెక్‌ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తొలుత బుకాయించినా ఆ తర్వాత నిజం అంగీకరించక తప్పలేదు.

థాయ్ మసాజ్ కోరిక:

థాయ్ మసాజ్ కోరిక:

థాయ్ లాండ్ వెళ్లి మసాజ్ చేయించుకోవాలనేది నర్సింహ కోరిక. అందుకయ్యే ఖర్చుల కోసం మరోసారి స్నాచింగ్ చేయాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు. దసరా తర్వాత మరోసారి స్నాచింగ్ చేయాలని కూడా ముందే నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ చేసిన బంగారాన్ని ఎక్కడైనా అమ్మి ఆ డబ్బుతో అతను థాయిలాండ్ వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు.

బీటెక్ స్టూడెంట్ పేరుతో బురిడీ:

బీటెక్ స్టూడెంట్ పేరుతో బురిడీ:

12ఏళ్లుగా కేబీఆర్ పార్కులో స్నాచింగ్ చేస్తున్న నర్సింహ.. గతంలో కేపీహెచ్‌బి లోని రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. అనుమానంతో పోలీసులు అతన్ని ప్రశ్నిస్తే.. బీటెక్ స్టూడెంట్ అంటూ నమ్మించి తప్పించుకునేవాడు. మాదాపూర్ చైన్ స్నాచింగ్ కేసులోను ఇలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోను స్నాచింగ్ కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోను ఇలాగే తప్పించుకున్నాడు. ఎట్టకేలకు కవల స్టంట్ మాస్టర్స్ ఇచ్చిన సమాచారంతో అతగాని స్నాచింగ్ లకు ఫుల్ స్టాప్ పడింది.

English summary
chain snatcher narsimha who terrorised kbr park walkers nabbed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X