ఛలో రాజ్ భవన్.. అధికార కాంగ్రెస్ ఆందోళన.. దేనికంటే!
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేడు చలో రాజభవన్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్ లో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. గౌతమ్ అదాని ఆర్థిక అవకతవకలతో దేశ ప్రతిష్ట దిగజారినా భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనిపైన స్పందించడం లేదని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
అధికార కాంగ్రెస్ భారీ నిరసన
ఈ సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు పిలుపుతో తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరసన నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు టిపిసిసి చలో రాజభవన్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ శ్రేణులు చలో రాజభవన్ కు రంగంలోకి దిగారు. అమెరికాలో అదానిపై నమోదైన కేసుల్లో విచారణ జరపాలని, జెపిసి వేసి విచారణ చేయాలని ఈ క్రమంలో డిమాండ్ చేస్తున్నారు.

చలో రాజ్ భవన్ లో సీఎం రేవంత్
అంతేకాదు మణిపూర్లో తీవ్రమైన శాంతిభద్రతల సమస్య ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు సందర్శించక పోవడాన్ని కూడా నిరసిస్తూ నేడు చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక చలో రాజ్ భవన్ నిరసన ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్చార్జి దీపా దాస్ మున్షి తో పాటు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
ఏఐసిసి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్త సమస్యల పైన తెలంగాణ అధికార కాంగ్రెస్ ప్రధానంగా ఫోకస్ చేయనుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసిసి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన క్రమంలో నేడు తెలంగాణ రాష్ట్రంలోనూ చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అధికార పార్టీ ఆందోళనపై సర్వత్రా ఆసక్తి
భారీ జన సమీకరణతో చలో రాజభవన్ కు వెళ్లాలని తద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రజలకు తెలిసేలా ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న ఆందోళన అన్ని వర్గాలలోను ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications