Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్, గోషామహల్ కు ఉప ఎన్నిక - గేమ్ షురూ, సర్వేలు తేల్చిందేంటి..!?

తెలంగాణ రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పార్టీలకు కొత్త పరీక్ష మొదలైంది. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ బై పోల్ పైన పార్టీలు ఫోకస్ చేయగా.. కొత్తగా గోషా మహల్ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక తప్పేలా లేదు. రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తూ.. ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసేందుకు బీజేపీ సిద్దమైంది. దీంతో, స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఫలితం ఏంటనేది ఇప్పటికే పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. అందులో ఆసక్తి కర ఫలితాలు వెల్లడి అవుతున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు
తెలంగాణలో 2023 ఎన్నికల తరువాత పార్టీల సత్తా ఏంటో చాటుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. కంటోన్మెంట్ బై పోల్ లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కోసం ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ స్థానం కాపాడు కొనేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా గోపీనాథ్ కుటుంబ సభ్యులకే సీటు ఇవ్వాలనే అభిప్రాయం తో ఉంది. అదే సమయంలో కంటోన్మెంట్ లో గెలిచిన విధంగానే జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం సీఎం రేవంత్ బై పోల్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక.. బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగు తారనేది చర్చగా మారింది. టీడీపీ నుంచి పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఎంఐఎం పోటీ ఇక్కడ గెలుపు - ఓటముల పైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.

chances-for-goshamahal-by-poll-along-with-jubilee-hills-amid-key-political-developments

గోషామహల్ కు తప్పదా..?
జూబ్లీహిల్స్ బై పోల్ పై చర్చ జరుగుతున్న సమయంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసారు. ఆయన తీరు పైన గుర్రుగా ఉన్న బీజేపీ నాయకత్వం రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసేందుకు సిద్దమైంది. పార్టీతోపాటు అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తే గోషామహల్‌లో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. రాజా సింగ్ పై బీజేపీ లేఖ రాసినా.. స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. స్పీకర్ బీజేపీ లేఖ పైన నిర్ణయం తీసుకుంటే.. జూబ్లీహిల్స్‌తోపాటే గోషామహల్‌కు కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్‌ విడుదల కానుంది. అప్పుడే రాష్ట్రంలోని ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సర్వేలు తేల్చిందేంటి
ఇక, ఈ ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారుతున్నాయి. రాజాసింగ్ పైన బీజేపీ నిర్ణయం.. ఎమ్మెల్యే పదవి పైన స్పీకర్ నిర్ణయం తరువాత ఇక్కడ బై పోల్ పైన స్పష్టత రానుంది. అయితే.. ఈ నియోజకవర్గంలో పరిస్థితి పైన రెండు ప్రధాన పార్టీలు సర్వేలు చేయిస్తు న్నారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ నమ్మకమైన సంస్థల ద్వారా సర్వే చేయించారు. ఏ పార్టీ ప్రభావం ఏంటనే అంచనాకు వచ్చారు. గోపీనాథ్ మరణం సెంటి మెంట్ .. స్థానిక బలం పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ మాత్రం సర్వేలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటోంది. బీజేపీ ఇక్కడ ఒక వర్గం ఓటింగ్.. టీడీపీ, జనసేన పొత్తు.. ఎంఐఎం ప్రభావం ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలతో అభ్యర్ధి ఎంపిక పైన నిర్ణయం తీసుకోనుంది. దీంతో.. ఇప్పుడు ఉప ఎన్నికలు ముఖ్య నేతల సమర్థతకు సవాల్ గా మారుతున్నాయి. గోషామహల్ పైన స్పష్టత వచ్చిన తరువాత లెక్కలు మారే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+