పెళ్లికోసం ఒత్తిడి, చంపేశా: చాందిని హత్యపై నిందితుడు, ప్లే బాయ్ కావొచ్చు, అమ్మాయిల్ని..

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandini Jain case : Sai Kiran Reddy Reveals Shocking Facts, CCTV footage | Oneindia Telugu

  హైదరాబాద్: మియాపూర్‌కు చెందిన చాందిని జైన్‌ను హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించారని తెలుస్తోంది. తాను క్షణికావేశంలో ఆమెను చంపేశానని వివరించాడు.

  అతనే చంపేశాడు?: వీడిన చాందిని జైన్ హత్య మిస్టరీ, ఆ ఫుటేజీ కీలకం..

  ఆరేళ్ల పరిచయం, పెద్దవాళ్లకు తెలియకుండా స్నేహం

  ఆరేళ్ల పరిచయం, పెద్దవాళ్లకు తెలియకుండా స్నేహం

  సమాచారం మేరకు చాందినితో పరిచయం, హత్య తదితర పరిణామాలపై నిందితుడు పోలీసులకు వివరాలు తెలిపారు. చాందిని తనకు ఆరేళ్లుగా తెలుసునని చెప్పాడు. చాందినిని తనకు దూరం చేశారని చెప్పాడు. చాందిని మాత్రం తనకు దూరం కాలేకపోయిందని చెప్పాడు. కానీ పెద్దవాళ్లకు తెలియకుండా తమ స్నేహం కొనసాగిందని చెప్పాడు.

  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

  పెళ్లి చేసుకోవాలని చాందిని తనను పదేపదే ఒత్తిడి చేసిందని అతను చెప్పాడు. అయితే కెరీర్ పరంగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశానని, కానీ చాందిని అంగీకరించలేదని చెప్పాడు.

  కలుద్దామని చాందినీయే ఫోన్ చేసింది

  కలుద్దామని చాందినీయే ఫోన్ చేసింది

  ఈ నెల 9వ తేదీన సాయంత్రం కలుద్దామని తనకు చాందినీయే ఫోన్ చేసిందని నిందితుడు చెప్పాడు. దీంతో తాను ఆమె ఇంటికి వెళ్లానని తెలిపాడు. ఎప్పుడు తాము కలుసుకునే అమీన్‌పుర ప్రాంతానికి ఆటోలో తాము వెళ్లామని చెప్పాడు.

  మళ్లీ పెళ్లి ప్రస్తావన

  మళ్లీ పెళ్లి ప్రస్తావన

  చాందిని మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చిందని, దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పాడు. దీంతో తాను కోపంతో కొట్టానని చెప్పాడు. అరిచి గీపెట్టడంతో గొంతు నులిమానని తెలిపాడు.

  చనిపోయిందని తెలిసి పారిపోయా

  చనిపోయిందని తెలిసి పారిపోయా

  దీంతో చాందిని స్పృహ తప్పి పడిపోయిందని సాయి తెలిపాడు. తన స్నేహితులకు ఫోన్ చేశానని, వారు వచ్చి చనిపోయినట్లు చెప్పారని పోలీసులకు వివరించాడని తెలుస్తోంది. దీంతో తాను అక్కడి నుంచి భయపడి పారిపోయానని చెప్పాడు. అంతా 5 నిమిషాల్లో జరిగిందని చెప్పాడు. ఆవేశంలో తాను చంపేశానని చెప్పాడు.

  స్నేహితులే ఇలా చేస్తే: చాందిన తల్లి

  స్నేహితులే ఇలా చేస్తే: చాందిన తల్లి

  స్నేహితులే ఇలా చేస్తే ఇక ఎవరిని నమ్ముతామని చాందిని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి వెనుక సూపర్ సీనియర్స్ ఉన్నారని ఆరోపించారు. మిగిలిన నిందితులను కూడా గుర్తించాలన్నారు. నమ్మిన స్నేహితులే చంపేశారన్నారు.

  ఇష్టం లేకుంటే వదిలేయాలని కానీ

  ఇష్టం లేకుంటే వదిలేయాలని కానీ

  సాయి కిరణ్ తన జీవితానికి అడ్డుగా ఉందని చంపేశాడని ఆరోపించారు. ఇష్టం లేకుంటే వదిలేయాలని కానీ చంపేస్తారా అని ప్రశ్నించారు. ఆడ పిల్లలు బయటకు వెళ్తే భద్రత లేకుండా పోతోందన్నారు. ఆడ పిల్లలను చదువుకునేందుకు బయటకు పంపించవద్దా అని నిలదీశారు. నిందితుడిని అక్కడే ఎన్‌కౌంటర్ చేయాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అన్నారు.

  ప్లే బాయ్ కావొచ్చు

  ప్లే బాయ్ కావొచ్చు

  నిందితుడు ప్లే బాయ్ అయి ఉండవచ్చునని, ఆరు నెలలకు ఓసారి అమ్మాయిని మార్చేవాడు కావొచ్చునని, అందుకే హత్య చేసి ఉంటాడని తల్లి ఆరోపించారు. బహుషా తన కూతురుతో అట్రాక్షన్ లాంటి రిలేషన్ ఏర్పడి అతడి పనులకు తమ కూతురు అడ్డును తొలగించుకోవాలని పథకం ప్రకారం చంపేసి ఉంటాడేమో అని చెప్పారు.

  ఒకే స్కూల్లో చదివారు కానీ

  ఒకే స్కూల్లో చదివారు కానీ

  చాందిని, అతడు సిల్వర్ ఓక్స్ స్కూల్లో చదువుకున్నారని తెలిపారు. కానీ ఇద్దరివి వేరే సెక్షన్లు అని, అదే సంస్థలో చాందిని ఇంటర్ చదువుతుండగా, సాయి ఎక్కడ చదువుతున్నాడో వీరి మధ్య ఎలాంటి అనుబందం ఉందో తమకు తెలియదన్నారు. కానీ మాకు జరగాల్సిన నష్టం జరిగిందన్నారు.

  మంచివాడనుకున్నాం

  మంచివాడనుకున్నాం

  అతను మంచివాడనుకున్నామని, ప్లాన్ ప్రకారం హత్య చేశాడన్నారు. మరికొందరు అబ్బాయిలతో కలిసి హత్య చేశాడని ఆరోపించారు. అతని గురించి చాందిని తమకు ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పలేదన్నారు. టీనేజ్ సమయంలో అట్రాక్షన్ సహజమేనని, అతన్ని ప్రేమిస్తున్నట్లు తన కూతురు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విచారణలో అన్నీ తెలుస్తాయన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The mysterious murder of Intermediate first year student Chandini Jain has finally been cracked. After finding the CCTV footage of Chandini and her friend near Ameenpur, police were able to catch hold of the friend Sai Kiran Reddy and three minors with the help of the auto driver.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి