చాందిని హత్య కేసులో ట్విస్ట్: ఆటోలో తీసుకెళ్లిన యువకుడు, కీలకంగా ‘మై హార్ట్’
ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. చాందిన అదృశ్యమైన రోజే ఆమెను ఓ యువకుడు ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది.
Recommended Video

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. చాందిన అదృశ్యమైన రోజే ఆమెను ఓ యువకుడు ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. వీరు బంజారాహిల్స్‌లోని పబ్బుకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, అంతకుముందే సదరు యువకుడితోపాటు మరో నలుగురు యువకులు పదే పదే చాందిని ఇంటి వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చాందిని ఫోన్ కాంటాక్టుల్లో 'మై హార్ట్' అనే పేరుతో ఓ కాంటాక్ట్ ఉందని, ఆ కాంటాక్టు నుంచి చాందినికి పదే పదే ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు యువకులు కూడా చాందినికి పరిచయస్తులేనని పోలీసులు భావిస్తున్నారు.
ముగిసిన పోస్టుమార్టం: ఒంటిపై గాయాలు
చాందిని మృతదేహానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. చాందిని చెంప, మెడ, కాళ్లపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అయితే, హత్యకు కారణాలెంటనే విషయం మాత్రం వైద్యులు వెల్లడించలేదు. కాగా, అత్యాచారం జరిగిందా? లేదా అనే విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
చాందిని డీసెంట్ అమ్మాయి
చాందిని చాలా డీసెంట్ అమ్మాయని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. పబ్బులకు వెళ్లే అలవాటు చాందినికి లేదని అన్నారు. చాందిని చేతిపై ఉన్న టాటూ ఆమె పుట్టిన రోజు తేదీ అని, రోమన్ సంఖ్యలో టాటూ వేసుకుందని చెప్పారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, తమకు ఎవరూ శత్రువులు లేరని చెప్పారు. అయితే, చాందినీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications