ప్రేమికులని తెలియదు: చాందిని తండ్రి కంటతడి, నా చెల్లి గురించి తెలుసు: సోదరి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమ కూతురును పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ తండ్రి కిషోర్ జైన్ అన్నారు.

చాందిని వదల్లేదు, చంపేశా: సాయి షాకింగ్, 'ప్లే బాయ్ కావొచ్చు, అమ్మాయిల్ని మార్చేవాడేమో'

కన్నీటిపర్యంతమైన తండ్రి

కన్నీటిపర్యంతమైన తండ్రి

తన కూతురు చాలా బాగా చదివేదని, ఎప్పుడూ కెరీర్ గురించి తనకు చెబుతుండేదని వాపోయారు. మంచి ఉద్యోగం సంపాదించి నేను మీ సంరక్షణ చూసుకుంటానని తమ కూతురు చెప్పేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సాయి కిరణ్ రెడ్డి అనే స్కూల్ స్నేహితుడే హత్య చేయడంతో తల్లిదండ్రులు షాకయ్యారు.

క్లోజ్‌నెస్ అనుకున్నాం.. ప్రేమికులు అనుకోలేదు

క్లోజ్‌నెస్ అనుకున్నాం.. ప్రేమికులు అనుకోలేదు

కోల్జ్ ఫ్రెండ్ ఇలా చేస్తాడని ఊహించలేదని తండ్రి అన్నారు. నిందితుడు, చాందిని మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ప్రశ్నించగా.. స్నేహితులు క్లోజ్‌గా ఉంటారు, వారు ప్రేమికులు అని ఎవరూ ఊహించలేరని చెప్పారు. మేం కూడా అనుకోలేదని చెప్పారు.

చాందిని కూడా మాకేం చెప్పలేదు

చాందిని కూడా మాకేం చెప్పలేదు

చాందిని కూడా తమ మధ్య ప్రేమ ఉన్న విషయాన్ని తమకు ఎప్పుడూ చెప్పలేదని తండ్రి అన్నారు. తమ పాప బాగా చదువుతుందని, కెరీర్ గురించి బాగా చెబుతుందన్నారు. ఏం కావాలన్నా నాతో చెబుతుంటుందన్నారు. తనను బాగా చూసుకుంటానని చెప్పేదన్నారు.

బ్యాంకాక్ వెళ్లా, తెలిసి వచ్చేశా

బ్యాంకాక్ వెళ్లా, తెలిసి వచ్చేశా

ఇది పక్కా ప్లాన్ హత్య అని తండ్రి వాపోయారు. పిల్లలు అన్నాక టీనేజ్‌లో అట్రాక్షన్ ఉంటుందని, కానీ దీనికి దారుణంగా చంపడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఆ రోజు బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్లానని చెప్పారు. విషయం తెలియగానే వెంటనే వచ్చానని చెప్పారు. పోలీసులు వాళ్ల పని వారు చేస్తున్నారని చెప్పారు. వారిపై నమ్మకం ఉందన్నారు.

అట్రాక్షన్ మాత్రమే కావొచ్చు

అట్రాక్షన్ మాత్రమే కావొచ్చు

మా చెల్లి, నిందితుడు ఆరో తరగతి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చాందిని సోదరి నివేదిత చెప్పారు. తాను వ్యక్తిగతంగా అతనిని కలువలేదని, స్కూల్లో మాత్రం చూశానని చెప్పారు. సాయి చెబుతున్నట్లుగా నా సోదరికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చునన్నారు. అది అట్రాక్షన్ మాత్రమే కావొచ్చునన్నారు. నా సోదరి ఎలాంటిదో నాకు తెలుసన్నారు.

వారిద్దరు కాంటాక్టులో ఉన్నట్లు తెలియదు

వారిద్దరు కాంటాక్టులో ఉన్నట్లు తెలియదు

నిందితుడిని తన సోదరి ఎప్పుడైనా బయట కలిసిందో తనకు తెలియదని సోదరి నివేదిత చెప్పారు. సాయి, తన సోదరి ఒకే స్కూల్లో చదివారని, ఆ తర్వాత అతను ఏ కాలేజీకి వెళ్లాడో తెలియదన్నారు. వారిద్దరు కాంటాక్టులో ఉన్నట్లు తెలియదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A missing class 12 student was found dead on Tuesday in the outskirts of Hyderabad, police said. The decomposed body of 17-year-old Chandni Jain, who was missing since September 9, was found on the hillocks near Ameenpur in Madinaguda. Locals who spotted the body alerted police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి