అతనే చంపేశాడు?: వీడిన చాందిని జైన్ హత్య మిస్టరీ, ఆ ఫుటేజీ కీలకం..

Subscribe to Oneindia Telugu
  Chandni Jain Case : అతనే చంపేశాడు? వీడిన చాందిని జైన్ హత్య మిస్టరీ, ఆ ఫుటేజీ కీలకం.| Oneindia Telugu

  హైదరాబాద్: మియాపూర్‌కు చెందిన చాందిని జైన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అనుమానించినట్లుగానే ఆమె స్నేహితుడు, స్కూల్ మేట్ అయిన డిగ్రీ విద్యార్థి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

  చాందిని హత్య కేసులో ట్విస్ట్: ఆటోలో తీసుకెళ్లిన యువకుడు, కీలకంగా 'మై హార్ట్'

  నిందితుడు చాందినిని అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ అమీన్ పూర్ గుట్టల వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవి ఫుటేజీలో స్పష్టంగా రికార్డయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుందన్న కారణంతోనే నిందితుడు ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

  మధ్యాహ్నాం మీడియా ముందుకు:

  మధ్యాహ్నాం మీడియా ముందుకు:

  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. అతను నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశముంది. బుధవారం మధ్యాహ్నాం పోలీసులు అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

  మిస్సింగ్ కేసు:

  మిస్సింగ్ కేసు:

  హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి చాందినీ జైన్ ఈనెల 9న మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో ఉన్న ఇంటి నుంచి శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ ను కలిసేందుకు బయటకు వెళ్లింది. ఆ రాత్రి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఆపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

  సంగారెడ్డి పోలీసుల సమాచారంతో:

  సంగారెడ్డి పోలీసుల సమాచారంతో:

  చాందిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రెండు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పోలీసుల నుంచి మియాపూర్ పోలీసులకు హత్య గురించి సమాచారం అందింది. అమీన్ పూర్ గుట్టల్లో చాందినీ మృతదేహాన్ని గుర్తించినట్లు సంగారెడ్డి పోలీసులు తెలిపారు.

  పోలీసులు సరైన సమయంలో సెల్ ఫోన్ ట్రాక్ చేసి ఉంటే చాందిని బతికేదని ఆమె ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన చెల్లెలిని హత్య చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టవద్దని చాందిని అక్క నివేదిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అత్యాచారం?, హత్య..:

  అత్యాచారం?, హత్య..:

  డెడ్ బాడీ పరిసరాలలో చాందినీ సెల్ పోన్, ఆమె బ్యాగ్, క్రెడిట్ కార్డు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ లో 'మై హార్ట్' పేరుతో ఉన్న నిందితుడి నంబర్ ను గుర్తించారు. దీంతో అతనితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  కేసు దర్యాప్తులో భాగంగా.. దాదాపు 40 సీసీటీవి ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో అమీన్ పూర్ గుట్టల వైపు ఇద్దరు నడిచి వెళ్తున్న దృశ్యాలు సీసీటివి ఫుటేజీలో రికార్డవడాన్ని గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chandini Jain murder case was chased by Miyapur police. They found her schoolmate Sai Kiran Reddy was the person behind this murder

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి