''చంద్రబాబు ఓటు రద్దు చేసుకొన్నారు'' :కెటిఆర్
కొత్తగూడెం : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైద్రాబాద్ లో ఓటు హాక్కు లేదన్నారు తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్. తట్టబుట్ట తీసుకొని చంద్రబాబునాయుుడు విజయవాడ వెళ్ళిపోయారని ఆయన ఎద్దేవాచేశారు.
చంద్రబాబునాయుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.హైద్రాబాద్ లో తన ఓటుహక్కును చంద్రబాబునాయుడు రద్దు చేసుకొన్నారని ఆయన చెప్పారు. కొత్త గూడెంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి సోమవారం నాడు ఆయన ప్రారంభించారు.

తెలంగాణలో టిడిపి అడ్రస్ లేదన్నారు. ఆ పార్టీ అధినేత హైద్రాబాద్ ను వదిలి వెళ్ళినవిషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు హైద్రాబాద్ ను వదిలిన తర్వాత ఆ పార్టీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం వల్ల కొత్తగూడెం జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు ఆయన చెప్పారు.కొత్తగూడెంలో నూతనంగా విమానశ్రయం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారాయన.












Click it and Unblock the Notifications