తెలంగాణలో మన పార్టీ పరిస్థితేంటి, మళ్లీ కలుద్దాం: బాబు ఆరా, వరంగల్ ఉప ఎన్నికపై..
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు తెలంగాణ టిడిపి నేతల నుంచి ఆరా తీశారని తెలుస్తోంది.
మంగళవారం నాడు విజయవాడలో పలువురు టి టిడిపి నేతలు విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడి ఎన్నిక
తెలంగాణలో పార్టీ నేతలు అందరూ కలిసి పని చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. త్వరలో మరోసారి భేటీ అవుతానని చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకుంటానని చంద్రబాబు నేతలకు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాల పైన ఎలా పోరాటం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే విషయమై చర్చించారు.
జిహెచ్ఎంసీ, వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ
జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ ఉప ఎన్నికల పైన చర్చించారు. వరంగల్ ఉప ఎన్నిక పైన పోటీకి టిడిపి ఆసక్తి కనబరుస్తోంది. అయితే, బిజెపి దీని కోసం పట్టుబడుతోందని విషయం ఈ భేటీలో చర్చకు వచ్చింది. అయితే, మరికొన్ని చర్చల తర్వాత స్పష్టత రావొచ్చని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కమిటీలో కొత్త వారికి అవకాశం: వివేకానంద
తెలంగాణ కమిటీలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని ఎమ్మెల్యే జి వివేకానంద అన్నారు. జిహెచ్ఎంసి, వరంగల్ ఉప ఎన్నికలపై చర్చించామన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే పలువురి ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications