తెలంగాణపై చంద్రబాబు ఫోకస్-నెలలో రెండ్రోజులు అక్కడే-టీటీడీపీ ఛీఫ్ పై క్లారిటీ..!
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టారు. గతంలో తెలంగాణపై ఓసారి పట్టు కోల్పోయాక తిరిగి దాన్ని అందుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు.. మధ్యలో కాంగ్రెస్ తోనూ జత కట్టినా ఫలితం లేకపోయింది. దీంతో గతేడాది తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. అయితే తన శిష్యుడు రేవంత్ రెడ్డి గెలుపు కోసమని కొందరు, బీజేపీ కోసమేనని మరికొందరు వ్యాఖ్యానించారు. అయినా బాబు మాత్రం నోరు మెదపలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరోసారి తెలంగాణపై ఫోకస్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వారికి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు, నియామకాలతో పాటు కీలకమైన టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక కోసం కూడా త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాదు ప్రతీ వారం రెండు రోజుల పాటు తెలంగాణలో ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు.

అలాగే ఇవాళ్టి టీటీడీపీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి నెల రెండవ శనివారం,ఆదివారం తెలంగాణలో ఉంటానని చంద్రబాబు తెలిపారు. పార్టీ నిర్మాణం పైనే దృష్టి సారిస్తామని, త్వరలో గ్రామస్తాయినుండి పార్టీ నిర్మాణం చేపడతామన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. యువకులకు,బీసీలకు పెద్దపీట వేస్తామన్నాు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications