వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చేద్దాం రండి?: నేతలకు బాబు కబురు.. రేవంత్ వెళ్తారా?, ఏం జరగబోతోంది!

నేతలతో సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై అధినేత చంద్రబాబు ఏదో ఒకటి తేల్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ ఢిల్లీ వెళ్లినవేళ.. అదే సమయంలో అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నవేళ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెద్ద కుదుపుకే లోనైంది. సొంత పార్టీ నేతల పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి.. కాంగ్రెస్‌తో దోస్తీకి రేవంత్ సంకేతాలివ్వడంతో గడిచిన వారం రోజుల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Recommended Video

టిడిపికి గుడ్‌బై! క్లైమాక్స్‌కు రేవంత్ : వాట్ నెక్స్ట్ ? | Oneindia Telugu

ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?

టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రావడంతో రేవంత్ రెడ్డిపై చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అనుకున్నట్టే.. చంద్రబాబు నుంచి టీటీడీపీ నేతలందరికి కబురు అందింది. బుధవారం ఉదయం 11గం.కు హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ కు రావాల్సిందిగా బాబు వారికి కబురు పెట్టారు.

 రేవంత్‌ను పిలిచారా?

రేవంత్‌ను పిలిచారా?

నేతలతో సమావేశానికి చంద్రబాబు కబురు పెట్టడంతో.. బుధవారమే రేవంత్‌పై ఆయన కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అయితే సమావేశానికి రేవంత్‌ను పిలిచారా? అంటే.. పిలిచారనే సమాధానమే వినిపిస్తోంది.రేవంత్ ను కూడా పిలిపించాలని సిబ్బందికి చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ రేవంత్ వస్తే సమావేశంలో బాబుతో ఏం మాట్లాడుతారు?, రేవంత్ మాటలను బాబు ఇంకా విశ్వసిస్తారా? అన్నది మిగతా నేతల్లోను ఆందోళన రేకెత్తిస్తోన్న అంశం.

 తేల్చేస్తారా?:

తేల్చేస్తారా?:

నేతలతో సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై అధినేత చంద్రబాబు ఏదో ఒకటి తేల్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన రేవంత్ ను పార్టీ నుంచి సాగనంపడానికే సిద్దపడుతారా? లేక అనూహ్య రీతిలో రేవంత్ కు సీనియర్లకు మధ్య సయోధ్య కుదిర్చి పార్టీలో కొనసాగించే ప్రయత్నం చేస్తారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో రేవంత్ సాన్నిహిత్యం బలపడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో బాబు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించకపోవచ్చు.

 రేవంత్‌ను సాగనంపితే:

రేవంత్‌ను సాగనంపితే:

ఒకవేళ పార్టీలో నుంచి రేవంత్ ను సాగనంపితే.. తదుపరి ఆ బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారనే దానిపై కూడా బాబు చూచాయగా సూచనలు చేసే అవకాశముంది. ఇప్పటికైతే ఈ విషయంలో మోత్కుపల్లి నరసింహులు పేరు మాత్రమే ముందు వరుసలో వినిపిస్తోంది. చాలా కాలంగా పార్టీలో రేవంత్ డామినేషన్ ను ఎదుర్కొంటున్న ఆయన.. పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో మోత్కుపల్లి నుంచి స్పష్టమైన వివరణ ఉంటే తప్ప బాబు ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం లేదనే అనుకోవచ్చు.

 పొత్తుకు 'నో గ్యారంటీ':

పొత్తుకు 'నో గ్యారంటీ':

తమది వ్యక్తుల పార్టీ అని టీటీడీపీ నేతలు పదేపదే చెప్పుకుంటున్నారు. అదే సమయంలో అధికార పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. పార్టీని బతికించుకోవాలన్న ఉద్దేశంతో వారు టీఆర్ఎస్ తో జతకట్టవచ్చనే ఆలోచన చేసి ఉండవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ కమ్ వ్యూహం కూడా దీనికి బలం చేకూరుస్తోంది.

అయితే నిజంగానే ఈ పొత్తు ఆచరణ రూపం దాలుస్తుందా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకేమి లేదని పలువురు టీఆర్ఎస్ నాయకులు చెబుతుండటంతో.. పొత్తు గ్యారంటీ అని చెప్పలేం. ఈ విషయంలో కేసీఆర్ ఆచీ తూచీ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అత్యవసరం అనుకుంటే తప్ప ఆయన ఆ పొత్తును కోరుకోకపోవచ్చు.

 బాబు ఎలా గాడినపెడుతారో?

బాబు ఎలా గాడినపెడుతారో?

కానీ టీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారం వల్ల టీడీపీకి స్వతంత్ర శక్తి లేదని, దానికి మరో తోడు ఉంటే తప్ప అంతో ఇంతో నిలదొక్కుకోవడం కష్టమనే సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న పార్టీకి ఈ పరిణామాలు మరింత ప్రతికూలమనే చెప్పాలి. దీంతో టీటీడీపీ భవిష్యత్తును చంద్రబాబు ఎలా గాడినపెడుతారన్నదే ప్రస్తుతానికి ఆ పార్టీ నేతల్లో మెదులుతోన్న ప్రశ్న.

English summary
TDP President Chandrababu Naidu conducting a meeting with Telangana Telugu Desam leaders to discuss over Revanth issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X