రేవంత్ రెడ్డికి చంద్రబాబు కౌంటర్ ..పేలుతున్న మాటల తూటాలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మరోసారి రాజుకుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కృష్ణా న‌ది జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కేటాయించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కృష్ణా న‌ది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణ‌లో ఉంటే కేవ‌లం 30 శాతం మాత్ర‌మే ఏపీలో ఉన్నందున కృష్ణా జ‌లాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

గోదావ‌రికి సంబంధించి తెలంగాణ వాటా నిక‌ర జ‌లాలు తేల్చిన త‌ర్వాతే ఏపీ ప్రాజెక్టుల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి పాటిల్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి
ఫిర్యాదు చేశారు.కృష్ణా జలాలను యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతోందని , దీనిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పాటిల్‌ను కోరారు.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.

Chandrababu Revanth Reddy comments on water dispute

గోదావరి నదిపై తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనదో ఏపీకి బంకచర్ల ప్రాజెక్ట్ అంతా ముఖ్యమైనది అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తాను ఏనాడు అడ్డుపడలేదనే విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాళేశ్వరంపై తాము రాజకీయం చేయలేదని, బంకచర్లను కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకొని, ఆ నీటిని వాడుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇక్కడ సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.తెలంగాణకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టానని తెలిపారు. బీమా, దేవాదుల సహా చాలా ప్రాజెక్టులకు తానే రూపకల్పన చేశానని వివరించారు. సముద్రంలోకి నిరుపయోగంగా వెళ్తున్న నీళ్లను ఉపయోగించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+