తెలంగాణలో ఎలా గెలవాలో చర్చిద్దాం విజయవాడకు రండి!: బాబు

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించేందుకు విజయవాడ రావాలని తెలంగాణ టిడిపి నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

విశాఖ/హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించేందుకు విజయవాడ రావాలని తెలంగాణ టిడిపి నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

ఆదిలాబాద్‌కి చెందిన మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ పార్టీని వీడి సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌, సిర్పూర్‌, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన నాయకులు బాబును కలిశారు.

అందుకే కేసీఆర్ ఫిరాయింపులకు తెరలేపారు

అందుకే కేసీఆర్ ఫిరాయింపులకు తెరలేపారు

క్షేత్రస్థాయిలో కార్యకర్తలు టిడిపిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రాంత మహానాడు విజయవంతమైన క్రమంలోనే టిఆర్ఎస్ ఫిరాయింపులకు తెర తీసిందని బాబుకు చెప్పారు.

రమేష్ రాథోడ్ మినహా ఎవరూ వెళ్లట్లేదు

రమేష్ రాథోడ్ మినహా ఎవరూ వెళ్లట్లేదు

రమేష్‌ రాథోడ్‌ మినహా మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లడం లేదని వారు చంద్రబాబుకు తెలిపారు. ఈ క్రమంలో విజయవాడ వచ్చి తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా, అక్కడ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం, పార్టీ బలోపేతంపైనా చర్చించుదామని చంద్రబాబు వారికి తెలిపారు.

తెలంగాణ నుంచి చాలామంది

తెలంగాణ నుంచి చాలామంది

విశాఖ మహానాడుకి తెలంగాణ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు, బస్సులతోపాటు ప్రయివేటు వాహనాల్లో భారీగా నాయకులు, కార్యకర్తలు వచ్చారని ఈ సందర్భంగా తెలంగాణ నాయకులు చంద్రబాబుకు తెలిపారు.

తెలంగాణలో పోటీ చేస్తారా

తెలంగాణలో పోటీ చేస్తారా

కాగా, రమేష్ రాథోడ్ చేరిక సందర్భంగా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబులాంటి వారికి తెలంగాణలో స్థానం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండాప్రజలను మోసం చేశారనీ, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తారని ప్రశ్నించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా తెలంగాణలోనూ పోటీ చేస్తానని చెబుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+