వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద డర్టీ పొలిటీషియన్ : కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత అబద్ధాల కోరు మరొకరు లేరని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. చంద్రబాబు దుర్మార్గుడని ఆయనకు ఒక వర్గం మీడియా డబ్బా కొట్టడం నిజంగా బాధాకరమని చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం తొడగొట్టిన చంద్రబాబుతోనే జై తెలంగాణ అని అనిపించామని కేసీఆర్ అన్నారు. చంద్రబాబును ఏపీ ప్రజలు భరిస్తున్నారంటే వారికి చేతులెత్తి నమస్కరించాలని అన్నారు.

 చంద్రబాబు నాయుడు అంత డర్టీ పొలిటీషియన్ ఈదేశంలో లేరు: కేసీఆర్

చంద్రబాబు నాయుడు అంత డర్టీ పొలిటీషియన్ ఈదేశంలో లేరు: కేసీఆర్

ప్రత్యేక హోదా అవసరమే లేదని చంద్రబాబు అన్నారు. రాహుల్ గాంధీపై నాడు అడ్డుగోలుగా మాట్లాడిన చంద్రబాబు నేడు అదే రాహుల్ గాంధీతో కలిసి తిరుగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఏపీ ప్రజలను వంచిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బతుకే అబద్దాలతో కూడుకున్నదని ధ్వజమెత్తారు కేసీఆర్. చంద్రబాబు చెప్పే అబద్దాలను ఓ వర్గం మీడియా పొగుడుతూ బాకాలు కొట్టడం సరికాదన్నారు. హరికృష్ణ శవం మీద చంద్రబాబు పేలాలు ఏరుకున్నారని విమర్శించారు. హరికృష్ణ చావును చంద్రబాబు సొమ్ము చేసుకునే నీచ ప్రయత్నం చేశారన్న కేసీఆర్.... ఇప్పుడు నందమూరి సుహాసినిని పట్టించుకోను కూడా పట్టించుకోరని చెప్పారు.

చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి పాడుపనులు: కెమెరా కంటికి చిక్కిన టీడీపీ సీనియర్ నేత రాసలీలలు..వీడియోచెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి పాడుపనులు: కెమెరా కంటికి చిక్కిన టీడీపీ సీనియర్ నేత రాసలీలలు..వీడియో

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను లేఖ రాస్తాను: కేసీఆర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను లేఖ రాస్తాను: కేసీఆర్

చంద్రబాబు దిక్కుమాలిన శ్వేత పత్రాలను విడుదల చేసి డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు కేసీఆర్. ఏపీ ప్రజలను పెద్దఎత్తున చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆయన విషపూరితమైన రాజకీయం చేస్తున్నారని చెప్పిన కేసీఆర్... ఏపీ ప్రజలు బాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌‌సభలో ఎంపీ కవిత... రాజ్యసభలో కేకే డిమాండ్ చేశారని అది రికార్డులో ఉందని చెప్పారు. ఇప్పుడేమో కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నారనే విషప్రచారం చేస్తున్నారని బాబుపై కేసీఆర్ ధ్వజమెత్తారు. నాడు హోదాతో ఏమొస్తుందని అన్న చంద్రబాబు నేడు హోదానే సంజీవని అనడం చూస్తే ఇంతటి దారుణమైన వ్యక్తి ఇంకెక్కడా కనిపించరని అన్నారు. నాలుగున్నరేళ్లు మోడీ సంకను చంద్రబాబు నాకాడని ఇప్పుడు రాహుల్ గాంధీ సంక నాకుతున్నాడని ఎద్దేవా చేశారు కేసీఆర్.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. అసలు చంద్రబాబు ఒక మనిషిలాగా మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. డిసెంబరులోనే ఏపీకి హైకోర్టు తీసుకెళుతామని సుప్రీంకోర్టులో చంద్రబాబు అఫిడవిట్ ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. ప్రజా సంక్షేమం మీద చంద్రబాబుకు ఆలోచన లేదని చెప్పారు.

చంద్రబాబు లీడర్ కాదు కేవలం మేనేజర్ మాత్రమే

చంద్రబాబు లీడర్ కాదు కేవలం మేనేజర్ మాత్రమే

చంద్రబాబు నాయకుడు అస్సలు కానే కాదన్నారు కేసీఆర్. తాను ఒక మేనేజర్ మాత్రమే అని చెప్పారు. తను స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తి కాదని చెప్పారు. తన మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కుని గద్దెనెక్కిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు కేసీఆర్. తన రెండు ఎంపీలతో తెలంగాణ తీసుకొచ్చినట్లు చెప్పిన కేసీఆర్... చంద్రబాబులా కుటిల రాజకీయాలు ఎన్నడూ చేయలేదని వెల్లడించారు. తాను ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం, కళ్యాణ లక్ష్మీ పథకం దేశంలో చాలా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని చెప్పారు కేసీఆర్.

 ఐటీలో చంద్రబాబు పీకింది ఏమి లేదు

ఐటీలో చంద్రబాబు పీకింది ఏమి లేదు

ఐటీ రంగంలో కూడా చంద్రబాబు పీకింది ఏమి లేదని కేసీఆర్ చెప్పారు. తనకు నగ్న సత్యాలు తెలుసని చెప్పారు. బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మెకానిజంల మీదనే ఐటీ వృద్ధి చెందిందే తప్పా... చంద్రబాబు ఘనత కాదని అన్నారు. హైదరాబాదు నగరం భౌగోళికంగా చాలా అనువైన ప్రాంతమని ఐటీ కంపెనీలు గుర్తించి రాజీవ్ గాంధీకి సూచించడంతో అక్కడికి వచ్చారు. సైబర్ టవర్స్ పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్ధన్ రెడ్డి అని గుర్తు చేశారు కేసీఆర్. అంతే తప్ప చంద్రబాబు చెబుతున్నట్లు ఆయన కాదని కేవలం డబ్బా కొట్టి మార్కెటింగ్ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని చంద్రబాబు దొంగలించారని చెప్పారు.

హిందీలో మాట్లాడటం చేతకాని చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతారా..?

ఏపీలో ప్రజలు చంద్రబాబును దారుణంగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతారని చంద్రబాబు చెబుతున్నారని... నాలుగు ముక్కలు ఇంగ్లీషులో మాట్లాడటం చేతకాదని, హిందీ మాట్లాడటం అంతకన్నా రాదని అలాంటప్పుడు ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బాబుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ రాబోతోందని కేసీఆర్ అన్నారు. తాము మాట్లాడుతున్నది ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే అని చెప్పిన కేసీఆర్ దిక్కుమాలిన ఫ్రంట్‌లతో తమకు పనిలేదని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో మొట్ట మొదటి ముఖ్యమంత్రి ప్రధానిగా అయ్యారని చంద్రబాబు అన్నారని.. అయితే పీవీ నరసింహారావు సీఎంగా చేసి ఆ తర్వాత ప్రధానిగా అయ్యారని చెప్పారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయగానే తన పక్కనే ఉన్న ఇతర నేతలు చంద్రబాబు ఇంతకాలం ఎలా భరించారని తనతో అన్నారని కేసీఆర్ వెల్లడించారు.

English summary
AP chief Minister Chandrababu naidu is a big bluff master said Telangana CM KCR. He alleged that Chandrababu naidu had been cheating the people of AP.Chandra babu naidu is not a leader but a manager said Mr. Rao. It was N. Janardhan reddy who was a former Chief minister in the erstwhile AP who laid foundation to the cyber towers said KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X