ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నేత జైపాల్ రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండ
హైదరాబాద్/విజయవాడ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఫోటోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుల దండ వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే విషయం తెలిసిందే.

జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంత నాయకుడు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయన ఫ్లెక్సీకి చెప్పుల దండ పడింది. కృష్ణా జిల్లా నూజివీడు చిన గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆయన ఫ్లెక్సీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం పైన వచ్చిన కొందరు యువకులు ఈ పని చేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీకి ఉన్న చెప్పులను తొలగించారు. కాగా, జైపాల్ రెడ్డి ఫ్లెక్సీ ఉండటం, దానికి చెప్పుల దండ వేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications