పోలీసుల అదుపులో చర్ల దళ కమాండర్.. ఎన్‌కౌంటర్ భయం; మావోయిస్టుల హెచ్చరిక లేఖ!!
తెలంగాణ చత్తీస్ గడ్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీకి చెందిన కొత్తగూడెం జిల్లా చర్ల దళ కమాండర్ రజిత అలియాస్ మడకం కోసిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం.

చర్ల దళ కమాండర్ రజితతో పాటు మరో నలుగురు మావోల అరెస్ట్
చర్ల దళ కమాండర్ రజిత అలియాస్ మడకం కోసి మావోయిస్టు పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య. దుమ్ముగూడెం మండలం ములకలపల్లికి చెందిన రజిత, దని తో పాటు మరో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ చత్తీస్ గడ్ పోలీసులు పక్కా సమాచారంతో డోకుపాడు, కూర్ణపల్లి, కూనవాయి గ్రామాలపై దాడి చేసి మావోలను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఎన్కౌంటర్ ఆందోళన... లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ
ఇక ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తారన్న ఆందోళనతో మావోయిస్టు పార్టీ వీరి అరెస్టుకు సంబంధించి ఒక లేఖను విడుదల చేసింది. కొత్తగూడెం జిల్లా డివిజన్ కమిటీ సభ్యుడు ఆజాద్, అల్లూరి సీతారామరాజుల పేరుతో విడుదలైన ఈ లేఖలో తెలంగాణ, చత్తీస్ గడ్ పోలీసులు అస్వస్థతకు గురైన రజితతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారని, వారిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారికి ఎటువంటి ప్రాణ హాని కలిగించవద్దని లేఖలో పేర్కొన్నారు.

అరెస్ట్ అయిన వాళ్లకు ప్రాణహాని జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిక
ఒకవేళ అరెస్ట్ అయిన వారికి ప్రాణ హాని కలిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్టయిన మావోయిస్టులకు ప్రాణ హాని కలిగితే పోలీసులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకు అధికార పార్టీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె మడకం కోసిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఆమె తల్లిదండ్రులు మారయ్య, పొజ్జమ్మ, తమ్ముడు సోను తెలిపారు. ఇక ఇదే సమయంలో రజితకు ఎటువంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పర్చాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మావోలకు పోలీసులకు మధ్య ప్రచ్చన్న యుద్ధం.. మావోయిస్ట్ పార్టీకి షాక్
మొత్తానికి మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో మావోయిస్టు పార్టీ నేతలు ప్రస్తుతం పట్టుబడటం పార్టీకి దెబ్బనే చెప్పాలి. ఇక మరోపక్క మావోయిస్టుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపడుతున్న పోలీసులు, మావోయిస్టులను పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ గిరిజన గూడేలలో తిరుగుతూ ప్రజల వారు వారికి సహకరించవద్దని, ఒకవేళ ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications