వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా తెలంగాణా సరిహద్దులో చెక్ పోస్టులు: ఏపీ ధాన్యం లారీలకు బ్రేక్; మళ్ళీ కొత్తపంచాయితీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ఓ కొత్త పంచాయతీ చోటు చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ నుండి ఏపీ కి మద్యం తీసుకెళ్తున్నారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకోవటం కోసం తెలంగాణా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఏపీ ధాన్యం లారీలను సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. దీంతో ఏపీ నుండి ధాన్యం తరలిస్తున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రవాణా అడ్డుకున్నారంటూ ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు

తెలంగాణా ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం విపరీతంగా ధాన్యం పండించింది. ఈ యాసంగి సీజన్ లో వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వరి వార్ కొనసాగుతుంది. అనేక పోరాటాల తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఢిల్లీ వేదికగా మహాధర్నా తరువాత కూడా కేంద్రం స్పందించకపోవటంతో ఎట్టకేలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యటమే తెలంగాణా ప్రభుత్వానికి ఇబ్బంది అయితే, పక్క రాష్ట్రం నుండి కూడా తెలంగాణాలోకి ధాన్యం వచ్చి పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ నుండి తెలంగాణాకు వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకుంటున్న తెలంగాణా అధికారులు

ఏపీ నుండి తెలంగాణాకు వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకుంటున్న తెలంగాణా అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధాన్యం సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా ఉంటే ఏపీ నుండి ధాన్యం తెలంగాణ రాష్ట్రానికి రావడంపై సర్కార్ సీరియస్ గా తీసుకుంది. గతంలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకుంటుంది. ఏపీ సరిహద్దులో తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకు వెళ్తున్న ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం లారీలను అనుమతించేది లేదని తెలంగాణ పోలీసులు తేల్చి చెబుతున్నారు.

కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద అధికారుల తనిఖీలు, ధాన్యం లారీలు నిలిపివేత

కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద అధికారుల తనిఖీలు, ధాన్యం లారీలు నిలిపివేత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ధాన్యం వాహనాలను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేసి నిలిపివేశారు. ఇక ఈ వివరాలను నమోదు చేసి మరీ లారీలను వెనక్కి పంపిస్తున్నారు. మిల్లర్ల నుంచి తెలంగాణకు తరలిస్తున్న ధాన్యం వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తెలంగాణలోకి అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఏపీ వాహనాలను కట్టడి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు.

లారీల అడ్డగింతతో మిల్లర్ల అసహనం, అన్నీ ఉన్నా ఆపుతున్నారని ఆందోళన

లారీల అడ్డగింతతో మిల్లర్ల అసహనం, అన్నీ ఉన్నా ఆపుతున్నారని ఆందోళన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చే ధాన్యాన్ని అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న ఆంధ్రా రైతులు లబోదిబోమంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ధాన్యాన్ని ఆపటం ఏంటని వాహనదారులు, మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారమే ఆంధ్రా నుంచి తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొస్తున్నామని, అయితే అకారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వే బిల్లులు తోపాటు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ సరైన కారణం చెప్పకుండా ధాన్యం లారీలను అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీతో సహా ఇతర రాష్ట్రాల ధాన్యం అనుమతించేది లేదన్న తెలంగాణా

ఏపీతో సహా ఇతర రాష్ట్రాల ధాన్యం అనుమతించేది లేదన్న తెలంగాణా


అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక లారీ డ్రైవర్లు వెనుదిరిగి వెళ్తున్నారు. ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు అధికారుల తనిఖీలు షాక్ ఇస్తున్నాయి. ఒకవేళ కొనుగోలు చేసినా ఇబ్బందులు వచ్చేలా ఉందని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.

English summary
problem has arisen between Andhra Pradesh and Telangana over paddy procurement. Telangana authorities are stopping paddy lorries coming into Telangana from Andhra Pradesh. They say paddy lorries will not be allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X