కమ్యూనిస్టులు కూడా ఏడుస్తారని అప్పుడే తెలిసింది: అన్నపై చెన్నమనేని
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరా యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంటే ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తి అని, కమ్యూనిస్టులు కూడా ఏడుస్తారని తన అన్నను చూసిన తర్వాతే తనకు అర్థమయిందని ఆయన సోదరుడు, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.
తాను విద్యార్థిగా విద్యార్థి సంఘాల గొడవల్లో గాయపడినప్పుడు కమ్యూనిస్టుగా ఉన్న చెన్నమనేని రాజేశ్వర రావు తనను చూసి ఏడ్చాడని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. ఇటీవల మరణించిన సీనియర్ రాజకీయవేత్త, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు సంస్మరణసభను శుక్రవారం హైదరాబాదులోని మాదాపూర్‌లో గల ఇమేజ్ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడారు.

రాగద్వేషాలకతీతంగా, సిద్ధాంతాలు పార్టీలతో సంబంధం లేకుండా రాజేశ్వర్‌రావు అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారని, అన్నను తామంతా అనుసరించేవారమని చెప్పారు. తమ తండ్రి పార్టీలకతీతంగా అందరితోనూ స్నేహంగా మెలిగేవారని, అందువల్లనే సంస్మరణసభకు భారీ సంఖ్యలో హాజరయ్యారని రాజేశ్వరరావు కుమారుడు, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు సోదరులు హన్మంతరావు, వెంకటేశ్వర్‌రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎల్పీ నేత జానారెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావ తదితరులు పాల్గొన్నారు,
లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ నారాయణరెడ్డి, ఆనందరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ సుధాకర్‌రావు, రేగులపాటి పాపారావు, పల్లా వెంకట్‌రెడ్డి, టీడీపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications