భారీగా తగ్గిన చికెన్ ధరలు..చికెన్ ప్రియులకు పండుగే!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు సంతోషం కలిగించే వార్త. మొన్నటిదాకా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు కొండ దిగి వస్తున్నాయి. గత నెలలో ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఇప్పుడు భారీగా క్షీణించాయి. ఒకప్పుడు కిలో రూ.340 నుంచి రూ.350వరకు పలికిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.100కు పైగా తగ్గి సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం శ్రావణ మాసం.

చికెన్ సరఫరా ఎక్కువ.. డిమాండ్ తగ్గుదల

ఈ పవిత్రమాసంలో అనేకమంది మాంసాహారానికి దూరంగా ఉంటారు, కాబట్టి చికెన్ సరఫరాకు తగిన డిమాండ్ లేదు. ఫలితంగా మార్కెట్‌లో చికెన్ సరఫరా ఎక్కువగా ఉండగా డిమాండ్ గణనీయంగా తగ్గింది. వ్యాపారులు ఈ పరిస్థితి కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల చికెన్ దుకాణదారుల ఆదాయం కూడా ప్రభావితమవుతోంది.

Chicken prices have crashed by over Rs 100 across Telangana and AP due to low demand in Shravanamasam

హైదరాబాదం విజయవాడ లలో చికెన్ ధరలు ఇలా

ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చికెన్ ధరలు చూసినట్లయితే హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.222గా, డ్రస్డ్ చికెన్ రూ.197గా అమ్ముడవుతోంది. ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.100, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో స్కిన్‌లెస్ రూ.240 కాగా, డ్రస్డ్ రూ.212, ఫారం లైవ్ రూ.110, రిటైల్ లైవ్ రూ.137గా ఉన్నాయి.

స్థిరంగా కొనసాగుతున్న కోడిగుడ్ల ధరలు

కరీంనగర్, వరంగల్ లోనూ హైదరాబాద్‌తో సమానంగా స్కిన్‌లెస్ రూ.222, డ్రస్డ్ రూ.197, లైవ్ బర్డ్ రేట్లు రూ.100 నుంచి రూ.127 మధ్యలో కొనసాగుతున్నాయి. కాగా కోడిగుడ్ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గుడ్లకు డిమాండ్ కొనసాగుతున్న క్రమంలో పెద్దగా గుడ్ల ధరలలో మార్పు లేదు విజయవాడలో 12 గుడ్లు రూ.75కి, హైదరాబాద్, కరీంనగర్‌లో రూ.74కి లభిస్తున్నాయి.

కొండా సురేఖ వివాదంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు.. అప్పటిలోగా ఉద్వాసన!
కొండా సురేఖ వివాదంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు.. అప్పటిలోగా ఉద్వాసన!

శ్రావణ మాసం కారణంగా చికెన్ వినియోగదారులకు ధరల ఉపశమనం

గత నెలలో ఒక్కో గుడ్డు రూ.8కి చేరినా ఇప్పుడు రూ.6 స్థాయికి తగ్గింది. మొత్తంగా శ్రావణ మాసం కారణంగా చికెన్ వినియోగదారులకు ధరల తగ్గుదలతో ఊరట కలిగినప్పటికీ, వ్యాపారులు మాత్రం డిమాండ్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+