ఇంటిపైనుంచి పడినా..: ఆ చిన్నారి మృత్యుంజయురాలు(వీడియో)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: గత ఆదివారం ఉదయం బహదూర్‌పురాలోని తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందపడిన 18నెలల చిన్నారి మృత్యుంజయురాలైంది. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురా ఎంవో కాలనీకి చెందిన ఇమ్రాన్‌, మహమూదా సుల్తానా దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఇన్యా ఫాతిమా(18 నెలలు).

తల్లిదండ్రుల నిర్లక్ష్యం: రెండో అంతస్తుపైనుంచి పడిన చిన్నారి

ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఫాతిమా వంటగది సమీపంలోని మెట్ల నుంచి మొదటి అంతస్తుకు చేరుకుంది. ఆ సమయంలో బట్టలు ఉతుకుతున్న సుల్తానా.. చిన్నారి వెళ్లిన విషయాన్ని గమనించలేదు.

faitma

ఈలోగా ఫాతిమా ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఎదురింట్లో ఉండే మురుగన్‌ దంపతులు చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వెంటనే ఫాతిమాను ఆసుపత్రికి తరలించారు.

బాలిక కోలుకుంటోందని, ప్రాణాపాయం తప్పిందని తల్లిదండ్రులు, పోలీసులు తెలిపారు. తమ కూతురుకు పెద్ద ప్రమాదం తప్పిందని పాతిమా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A baby girl was hospitalised with injuries after she accidentally fell from the first-floor of a residential building in Bahadurpura area here, police said today.
Please Wait while comments are loading...