చిరంజీవిని కోర్టు మెట్లెక్కించిన GHMC..ఎందుకో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల తీరు షాకిచ్చింది. తన నివాసం పునర్నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా, నెల రోజులుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ న్యాయస్థానం జోక్యాన్ని కోరారు.
జూబ్లీహిల్స్‌లో చిరంజీవికి సొంత నివాసం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 2000వ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని అనుమతులు తీసుకొని ఈ ఇంటిని నిర్మించుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలు కావడంతో, ఇటీవల తన ఇంటిని పునర్నిర్మించుకోవాలని, మరికొన్ని నిర్మాణాలు చేపట్టాలని మెగాస్టార్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే, సవరణలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ అనుమతుల కోసం ఇటీవల GHMCకి దరఖాస్తు చేసుకున్నారు.

చిరంజీవి దరఖాస్తు చేసుకుని దాదాపు నెల రోజులు గడిచినా GHMC నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఈ విషయంపై అధికారులకు ఫోన్లు చేసినా వారు స్పందించకపోవడంతో చిరు అసహనానికి గురయ్యారు. చివరకు, తన న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.
చిరంజీవి పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు, GHMC అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని వారిని నిలదీసింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా? అని ప్రశ్నించింది. సాధ్యమైనంత త్వరగా చిరంజీవి ఇంటి పునర్నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని GHMCని ఆదేశించింది. న్యాయస్థానం జోక్యంతోనైనా మెగాస్టార్‌కి సకాలంలో అనుమతులు లభిస్తాయో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications