‘చోటా ఆద్మీ బడా కామ్ కర్‌ రే’ - ‘క్యా బండీ.. కైసే హై’ : ప్రధాని పలకరింపు - ప్రశంసలు..!!

ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ను ప్రశంసించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ మోత్తం షెడ్యూల్ బిజీ బిజగా గడిపారు. ఈ పర్యటనలో పార్టీ నేతలకు సమయం ఇవ్వలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. జ్వరం కారణంగా ఆయన ప్రధానితో కలిసి పర్యటనలో పాల్గొనలేద ని చెబుతున్నారు. అయితే, దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధాని ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని ప్రసంగించారు.

 ప్రధాని టూర్ కు దూరంగా సీఎం కేసీఆర్

ప్రధాని టూర్ కు దూరంగా సీఎం కేసీఆర్

ఆ కార్యక్రమానికి అయినా సీఎం కేసీఆర్ హాజరవుతారని భావించారు. కానీ, కేసీఆర్ విగ్రహావిష్కరణ కు సైతం గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ మంత్రులు..టీఆర్ఎస్ నేతలు కేంద్రం తెలంగాణ పైన చూపిస్తున్న వివక్ష అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. బీజేపీ నేతలు సైతం వీటికి ఇచ్చిన కౌంటర్లతో సోషల్ మీడియా హోరెత్తింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సైతం టీఆర్ఎస్ నేతలు పెద్దగా కనిపించ లేదు. శంషాబాద్ లో దిగిన ప్రధాని అక్కడ నుంచి ఇక్రిశాట్ కు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్ లో ఎక్కువ సమయం కేటాయించారు.

తిరుగు ప్రయాణం సమయంలో కీలక సన్నివేశం

తిరుగు ప్రయాణం సమయంలో కీలక సన్నివేశం

తిరిగి ఢిల్లీకి వెళ్లే సమయంలో ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ వీడ్కోలు పలికారు.ఆ సమయంలో ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ భుజం తట్టి పలకరించారు. 'క్యా బండీ.. కైసే హై' అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. ఇక, తిరుగు పయణం సమయంలో హుజూరా బాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా అభినందించారు. బండి సంజయ్ ప్రధాని మోదీకి ఈటలను పరిచయం చేశారు.

బండి - ఈటలకు ప్రధాని ప్రశంసలు

బండి - ఈటలకు ప్రధాని ప్రశంసలు

ఈ సందర్భంగా ఆయన భుజం తట్టిన మోదీ.. 'చోటా ఆద్మీ బడా కామ్ కర్‌ రే' అని ప్రశంసించారు. ఇద్దరినీ ఆశిర్వదించారు. హోరా హోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపు తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ప్రశంసించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వైపు కేంద్ర ప్రభుత్వం పైన..ప్రధాని పైన విమర్శలు చేస్తూ... మోదీ పర్యటనకు దూరంగా ఉన్న సమయంలో...ప్రధాని ఇలా... ఈటలను ప్రశంసించటం... బీజేపీ నేతలను అభినందించటం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయ పోరు పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రధాని చేసిన వ్యాఖ్యల పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+