దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారు,చికిత్స జరుగుతోంది: వైద్యులు
ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాసరి చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు ప్రకటించారు.
హైదరాబాద్:;ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఆరోగ్యంగానే ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాసరి చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు ప్రకటించారు.
అస్వస్థతకు గురైన ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

దాసరినారాయణరావు అన్నవాహికకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. అన్నవాహిక ఇన్ ఫెక్షన్ ను శస్త్రచికిత్స ద్వారా సరిచేసినట్టుగా వైద్యులు చెప్పారు.
కిడ్నీలకు కూడ ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు చెప్పారు. ఊపిరి తిత్తులకు కూడ సమస్య వచ్చిందని వైద్యులు గుర్తించారు.అయితే ఒకదాని తర్వాత మరోకటి చికిత్స చేసి సరిచేస్తున్నట్టుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications