విధులకు వచ్చి లేడీ కానిస్టేబుల్ అదృశ్యం: వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: విధులకు వచ్చిన ఓ సీఐఎస్‌ఎఫ్ మహిళ కానిస్టేబుల్ అదృశ్యమైంది. సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీసులు కథన ప్రకారం - చర్లపల్లి డివిజన్ పరిధిలోని మింట్ ప్రభుత్వ పరిశ్రమలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అషా అజ్మిరా(51) ఎప్పటిలాగే విధులకు వచ్చింది.
బయట పని ఉందని అనుమతి తీసుకొని వెళ్లింది. తిరిగి హాజరుకాకపోవడంతో వెంటనే స్థానికంగా వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తోటి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదిలావుంటే, హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధించడం వల్లే తన కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. మృతురాలి తండ్రి చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన డీకొండ శ్రీకాంత్‌కు జ్యోత్స్నతో 2008 ఆగస్టు 31న జరిగింది.

ఆమె కుటుంబసభ్యులు రూ. 10 లక్షలు కట్నం కింద ఇచ్చారు. ఈ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్‌లో ఉంటున్నారు. వీరికి సాయిశ్రీ వాత్సవ, సాయిశ్రీ వర్షిణి సంతానం. ఈ క్రమంలో గురువారం జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.
కనీసం తన జ్యోత్స్నను చూసేందుకు కూడా వారు అంగీకరించలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. కూతురును చూసేందుకు ఇంటికి వెళ్తే అల్లుడు సహించేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా కూతురుపై వేధింపులకు పాల్పడుతూ మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవాడన్నాడు.
తన కూతురు సంసారాన్ని బాగుచేయాలని పలుసార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తన అల్లుడు ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. జ్యోత్స్నను చంపేసి ఆత్మహత్మగా చిత్రకరిస్తున్నారన్న అనుమానం ఉందన్నారు. చక్రపాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications