వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామస్థులకు షాకిచ్చిన కేసీఆర్, ఆనందం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగితే లబ్ధిదారులే అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం సూచించారు.

అదివారం కేసీఆర్ మెదక్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని పాములపర్తి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తమకూ ఇళ్లు కట్టివ్వాలని కోరారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. నిర్మాణంలో అక్రమాలు జరిగితే లబ్ధిదారులే అడ్డుకోవాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రస్తుతం అలాంటి అవకాశం లేకుండా చూడటం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లబ్ధిదారుల్లో ఎవరైనా అనర్హులు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇళ్లను అగ్గిపెట్టేల్లా కాకుండా అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. వరంగల్ గ్రామసభల్లోను కేసీఆర్ పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యపడుతుందని, ఇందుకోసం ప్రజలంతా ఐక్యమత్యంతో ముందుకెళ్తూ బంగారు తెలంగాణ సాధన దిశగా సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం కాగా, ప్రభుత్వం ఆమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాములపర్తికి వరాల జల్లు కురిపించగా, సుమారు రూ.12 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులు అప్పటికప్పుడే మంజూరు చేశారు.

కేసీఆర్

కేసీఆర్

అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేసే క్రమంలో 150 ఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి రూ.3.5 లక్షలతో డబుల్‌బెడ్ రూంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

అలాగే శిథిలావస్థకు చేరిన పశువుల ఆసుపత్రికి నూతన భవనం ఏర్పాటు, రూ.50 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ, గ్రామశివారులో వైకుంఠధామం, రెండు అంగన్‌వాడీలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

రూ.50 లక్షలతో సిసిరోడ్లు, రూ.80 లక్షలతో మురుగు కాలువల ఏర్పాటు, దాహార్తి నివారణకు వాటర్ ట్యాంకు నిర్మాణం, రెండు బోర్లు, పైపులైన్ నిర్మాణం, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బస్ షెల్టర్, గ్రామ పంచాయతీకి అదనంగా రెండు గదుల నిర్మాణం, గ్రామంలో మూడురోడ్ల నిర్మాణం, రెండు హైమాస్ట్‌లైట్లు తదితర పనులకు కేసీఆర్ నిధులు మంజూరు చేశారు.

 కేసీఆర్

కేసీఆర్

కాగా, పది రోజుల్లో అభివృద్ధి పనులకు తానే స్వయంగా శ్రీకారం చుడతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

కేసీఆర్ పాములపర్తిలో జనంతో మమేమకయ్యారు. ఆకస్మికంగా గ్రామాన్ని సందర్శించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమస్యల పైన ఆరా తీశారు. నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ చేతులు పెట్టిస్తానని ఓ వికలాంగుడికి హామీ ఇచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

ఆర్టీసీ సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సమ్మెకు వీలైనంత త్వరలో పరిష్కార నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ఆర్టీసీ సమ్మెపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం కార్మిక మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావుతో సమీక్షించారు.

కేసీఆర్

కేసీఆర్

సమ్మె విషయంలో అన్ని వర్గాలతో చర్చించి, తగిన సిఫారసులు చేయడానికి ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఇందులో మంత్రులు నాయిని, ఈటెల, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. కార్మికులు, ఆర్టీసి యాజమాన్యం, అధికారులతో చర్చలు జరిపి తగిన సూచనలు చేయాల్సిందిగా మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఆదేశించారు.

English summary
CM KCR ADDRESSING GRAM SABHA AT WARGAL IN MEDAK DISTRICT
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X