Kanti velugu: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు ప్రారంభించిన సీఎంలు..

తెలంగాణలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభం అయింది. రెండో విడత కంటి వెలుగును సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు ప్రారంభించారు. ప్రజలకు సీఎం కేసీఆర్, కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యాదవ్‌, పినరయి విజయన్‌, భగవంత్‌ మాన్‌ డి.రాజా కళ్లద్దాలు అందజేశారు. సీఎం కేసీఆర్ సీపీఐ నేత రాజాలకు స్కీం గురించి వివరించారు. కంటి పరీక్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.

అంతకు ముందు ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కలెక్టరేట్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిల్డింగ్ రిబ్బన్ కట్ చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్​ మాన్ సింగ్​, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ ​యాదవ్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రే హైదరాబాద్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రులు ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకుని అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు.

CM KCR along with Pinarayi Vijayan, Kejriwal and Bhagwant Man inaugurated the second phase of Kanti Velam in Khammam.
విందు తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎం.. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లలో యాదగిరిగుట్టకు వెళ్లారు. వారంతా యాదగిరిగుట్టలో నేరుగా ప్రెసిడెన్షియల్‌ సూట్లకు చేరుకున్నారు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ విశిష్టతను నేతలకు వివరించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ నేత డి. రాజా యాదగిరి గుట్టకు వెళ్లినా స్వామివారి దర్శనానికి మాత్రం వెళ్లలేదు. వీరంతా కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+